Air Hostess : స్పైస్ జెట్ విమానంలో ఎయిర్ హోస్టెస్‌పై ప్రయాణికుడి వేధింపులు
స్పైస్ జెట్ విమానంలో ఎయిర్ హోస్టెస్‌ను ఓ ప్రయాణికుడు వేధించిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఢిల్లీ-ముంబయి స్పైస్‌జెట్ విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు మహిళా ఫ్లైట్ అటెండెంట్‌తో పాటు సహ ప్రయాణీకురాలిని వేధించాడు....

SpiceJet Air Hostess
Air Hostess : స్పైస్ జెట్ విమానంలో ఎయిర్ హోస్టెస్‌ను ఓ ప్రయాణికుడు వేధించిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఢిల్లీ-ముంబయి స్పైస్‌జెట్ విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు మహిళా ఫ్లైట్ అటెండెంట్‌తో పాటు సహ ప్రయాణీకురాలిని వేధించాడు. ఈ ఘటన ఆగస్ట్ 16న ఢిల్లీ-ముంబై స్పైస్‌జెట్ విమానంలో చోటు చేసుకుంది. (Man harasses air hostess) వేధించడమే కాకుండా తన సెల్ ఫోన్ తో ఎయిర్ హోస్టెస్ ఫొటోలు తీశాడు. ఢిల్లీ నుంచి ముంబయికి వెళ్లే స్పైస్‌జెట్ ఫ్లైట్ ఎస్ జి 157 (SpiceJet flight) మొదటి వరుసలో కూర్చున్న ఒక ప్రయాణికుడు టేకాఫ్ సమయంలో క్యాబిన్ సిబ్బంది చిత్రాలను క్లిక్ చేయడం కనిపించింది.
సిబ్బంది ప్రశ్నిస్తే ప్రయాణికుడు తన ఫోన్ నుంచి చిత్రాలను తొలగించి లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ కావడంతో ఢిల్లీ మహిళా కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది. విమానాల్లో మహిళలపై లైంగిక వేధింపుల ఫిర్యాదులు పెరుగుతున్నాయని, ఇది ఆమోదయోగ్యం కాదని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ అన్నారు. ఈ ప్రత్యేక కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, విచారించి, దోషులను శిక్షించాలని స్వాతి మలివాల్ కోరారు.
Lord Automotive: 8 అధునాతన విద్యుత్ వాహనాలను విడుదల చేసిన లార్డ్స్ ఆటోమేటివ్
ఈ వ్యవహారంపై ఢిల్లీ పోలీసులు, ఐజీఐ ఎయిర్‌పోర్ట్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కి మహిళా ప్యానెల్ నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 23వతేదీలోగా చర్యలు తీసుకున్న నివేదికలను అందించాలని ఢిల్లీ పోలీసులు, డీజీసీఏలను మహిళా కమిషన్ కోరింది. విమానాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా డీజీసీఏ జీరో-టాలరెన్స్ విధానాన్ని అవలంభించి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్వాతిమలివాల్ సూచించారు.