గ్రేట్ ఎస్కేప్ : కదిలే బస్ చక్రంలో ఇరుక్కుని బైటపడ్డాడు

  • Publish Date - September 17, 2019 / 11:22 AM IST

బైటకొచ్చామంటే క్షేమంగా ఇంటికి తిరిగి వెళతామో లేదో తెలీదు. రోడ్డుపై మనం కరెక్టుగా వెళ్తున్నా..ఏ వెహికల్ ఎటువైపు నుంచి వచ్చి మీద పడుతుందోనే భయం వేస్తుంటుంది. ఇదిగో ఇటువంటి అత్యంత ప్రమాదకర ఘటన కేరళలో చోటుచేసుకుంది. భూమి మీద ఇంకా నూకలు మిగిలి ఉన్నాయోమో అత్యంత ప్రమాదం నుంచి బైటపడ్డాడు ఓ వ్యక్తి. ఈ ప్రమాదం చూస్తే నిజంగా ఇతను మృత్యుంజయుడే అనిపిస్తుంది. 

రోడ్డుపై బైక్ మీద వెళ్తున్న ఓ వ్యక్తిని ప్రైవేట్ బస్సు ఢీకొంది. అలా బైక్ పక్కకు పడిపోగా..అతను మాత్రం బస్సు చక్రంలో  ఇరుక్కుపోయాడు. తలతో సహా బాడీ అంతా బస్సుకి..చక్కానికి మధ్య ఇరుక్కుపోయాడు. అలా కొన్ని మీటర్ల దూరం బస్సు వెళ్లింది.

సోమవారం (సెప్టెంబర్ 16)న కేరళలోని పుత్తుప్పడిలోని ఎంగపుళ బస్ స్టాండ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. బస్సు ముందు చక్రంలో చిక్కుకున్న వ్యక్తి స్థానికులు హెచ్చరించటంతో బస్సు డ్రైవర్ ను అప్రమత్తం చేయటంతో ఎట్టకేలకు ప్రాణాలతో బైటపడ్డాడు.