Delhi : దొరక్కూడదని..! బంగారం పేస్ట్‌‌ను అక్కడ దాచేశాడు

ఎయిర్ పోర్టులో ఫ్రిస్కింగ్ చేస్తున్న సమయంలో మలాశయం వద్ద మెటల్ ఉన్నట్లు గుర్తించామని సీఐఎస్ఎఫ్ సబ్ ఇన్స్ పెక్టర్ బి. దిల్లీ వెల్లడించారు.

Imphal Airport : అక్రమంగా బంగారాన్ని తరలించేందుకు వినూత్న మార్గాలు వెతుక్కుంటుంటారు కొందరు స్మగ్లర్లు. వీరు ఎక్కడ దాచిపెట్టారో తెలిసి అందరూ షాక్ తింటారు. కొంతమంది షూలు, స్నాక్స్, శరీరంలోని వివిధ భాగాల్లో బంగారం పెట్టుకుని దేశాలు దాటేందుకు యత్నిస్తుంటారు. కానీ..వీరి ఆటలకు తనిఖీలు చేసే సిబ్బంది చెక్ పెడుతుంటారు. ఎలాగొలా…బయటకు వద్దామని అనుకున్న స్మగ్లర్లను కటకటాల్లోకి నెట్టేస్తుంటారు. తాజాగా..ఓ వ్యక్తి బంగారం ఎక్కడ దాచాడో తెలిసి షాక్ తిన్నారు అధికారులు. ఈ ఘటన ఇంపాల్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది.

Read More : Jagadguru Paramhans: భారత్ ను హిందుదేశంగా ప్రకటించి..ముస్లిం, క్రైస్తవుల జాతీయతను రద్దుచేయండి..లేదంటే జలసమాధి అవుతా.

మహ్మద్ షరీఫ్ అనే వ్యక్తి…కేరళ రాష్ట్రంలోని కోచికోడ్ కు చెందిన వారు. ఇతను ఇంఫాల్ నుంచి ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో వెళ్లాల్సి ఉంది. విమానాశ్రయానికి చేరుకున్న ఇతడిని సీఐఎస్ఎఫ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎయిర్ పోర్టులో ఫ్రిస్కింగ్ చేస్తున్న సమయంలో మలాశయం వద్ద మెటల్ ఉన్నట్లు గుర్తించామని సీఐఎస్ఎఫ్ సబ్ ఇన్స్ పెక్టర్ బి. దిల్లీ వెల్లడించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని…ఆ గోల్డ్ ను బయటకు తీయడం జరిగిందన్నారు.

Read More :  Moosi Project Flood : మూసీలోకి భారీగా వరదనీరు… 8 గేట్లు ఎత్తివేత

సుమారు 900గ్రాముల గోల్డ్ పేస్టు ఉందని, దీనివిలువ రూ. 42 లక్షలు ఉంటుందన్నారు. మొత్తం నాలుగు గోల్డ్ పేస్ట్ ప్యాకెట్లు ఉన్నాయన్నారు. వీటి బరువు 90.68 గ్రాములు ఉందన్నారు. తనిఖీ సమయంలో తాము అడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానం ఇవ్వలేదని, దీంతో మెడికల్ ఎగ్జామినేషన్ రూమ్ లో ఎక్స్ రే తీయించామన్నారు. ఎక్స్ రే రిపోర్టు ప్రకారం మలాశయ భాగంలో లోహం ఉందని గుర్తించామన్నారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు