Jagadguru Paramhans: భారత్ ను హిందుదేశంగా ప్రకటించి..ముస్లిం, క్రైస్తవుల జాతీయతను రద్దుచేయండి..లేదంటే జలసమాధి అవుతా.

భారత్ ను హిందుదేశంగా ప్రకటించి..ముస్లిం, క్రైస్తవుల జాతీయతను రద్దుచేయండి..లేదంటే నేను సరయు నదిలో జలసమాధి అవుతానని జగద్గురు పరమహంస ఆచార్య మహారాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Jagadguru Paramhans: భారత్ ను హిందుదేశంగా ప్రకటించి..ముస్లిం, క్రైస్తవుల జాతీయతను రద్దుచేయండి..లేదంటే జలసమాధి అవుతా.

Declare India A ‘hindu Rashtra’

Declare India a ‘Hindu Rashtra’ Jagadguru Paramhans Demanded : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల జరుగనున్న క్రమంలో జగద్గురు పరమహంస ఆచార్య మహారాజ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ జన్మదినం అక్టోబర్ 2నాటికి భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని చవానీకి చెందిన ప్రముఖ తపస్వీ జగద్గురు పరమహంస ఆచార్య మహారాజ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగద్గురు చేసిన ఈ డిమాండ్ పెను సంచలనంగా మారింది. ఇటువంటి డిమాండ్ చేసిన జగద్గురు మా డిమాండ్లను నెరవేర్చాలని లేకుంటే తాను సరయు నదిలో జల సమాధి చేసుకుంటాను’’అంటూ అయోధ్య వేదికగా ఆచార్య మహారాజ్ బెదిరింపులకు దిగటం సంచలనంగా మారింది. అక్కడితో ఊరుకోకుండా.. భారతదేశంలోని ముస్లిములు, క్రైస్తవుల జాతీయతను రద్దుచేయాలని కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని జగద్గురు పరమహంస డిమాండ్ చేశారు.

కాగా..పరమహంస ఆచార్య గతంలో 15 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు.అప్పట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నుంచి హామీ లభించిన తర్వాత ఆయన నిరాహార దీక్ష విరమించారు.జగద్గురు పరమహంస చేసిన డిమాండ్లకు మద్దతుగా హిందూ సనాతన ధర్మ సంసద్ నిర్వహిస్తామని అయోధ్యలోని సాధువు సంఘం వెల్లడించింది.

Read more : Dalits into temples : తొలిసారి దేవాలయాల్లో అడుగు పెట్టిన దళితులు..సంతోషంగా ఉందంటూ కన్నీరు

కాగా..2022 లోఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యూపీ ఇప్పటికే రాజకీయ పరంగా వేడెక్కగా..అధికార..ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటుండగా పులిమీద పుట్రలాగా జగద్దురు పరమహంస తాజాగా చేసిన ఈ డిమాండ్స్ పెను సంచలన వ్యాఖ్యలు చేశారు.రామజన్మభూమి అయోధ్యలో రామమందిర నిర్మాణం శరవేగంగా జరుగుతున్న సమయంలో, అధికార బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ మరియు కాంగ్రెస్ సహా 2022 ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించిన తరుణంలలో ఈ వ్యాఖ్యలు డిమాండ్స్ కాకపుట్టిస్తున్నాయి.

ఇంతకుముందు, మోహన్ భగవత్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) భారత్ హిందూ దేశం అనీ..130 బిలియన్ల భారతీయుల పూర్వీకులకు సంబంధించిన పూర్వీకులు ఉన్నారని అందుకే హిందుదేశం అనే పిలవాలని పదేపదే నొక్కిచెప్పారు. సెప్టెంబర్ 6 న పూణేకి చెందిన గ్లోబల్ స్ట్రాటజిక్ పాలసీ ఫౌండేషన్ నిర్వహించిన ఒక కార్యక్రమానికి హాజరైనప్పుడు..భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇస్లాం ఆక్రమణదారులు భారతదేశానికి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయారనీ..వ్యాఖ్యానించారు. భారత్ ను హిందూ దేశంగా మార్చద అంశం ఎంత తొందరగా చేస్తే అంత మంచిదని లేదంటే భారత్ కు నష్టం వాటిల్లుతుంది అని వ్యాఖ్యానించారు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ యోహన్ భగవత్.

Read more : Self Abortion: యూట్యూబ్ చూసి..ఏడవ నెలలో అబార్షన్ చేసుకున్న యువతి..ఏమైందంటే..