Sumit Saurabh : కాఫీ ఆర్డర్ చేస్తే.. చికెన్ ముక్క వచ్చింది.. జొమాటో రెస్పాన్స్..!

Sumit Saurabh : అసలే ఉరుకుల పరుగుల జీవితం.. క్షణం తీరికలేకుండా గడిపేస్తున్నారు. ఏది కూడా స్వయంగా లేదా ఇంట్లో తయారుచేసుకునే పరిస్థితి లేదు.

Sumit Saurabh : అసలే ఉరుకుల పరుగుల జీవితం.. క్షణం తీరికలేకుండా గడిపేస్తున్నారు. ఏది కూడా స్వయంగా లేదా ఇంట్లో తయారుచేసుకునే పరిస్థితి లేదు. అంతా ఆన్‌లైన్‌లే.. అందులోనూ ఫుడ్ డెలివరీ యాప్స్ అందుబాటులో ఉన్నాయిగా.. అని వెంటనే ఆర్డర్ చేసేస్తున్నారు. కానీ, ఇలాంటి సందర్భాల్లో కస్టమర్లు తాము ఆర్డర్ చేసిన వంటకాల్లో ఏదో ఒకటి బల్లి, కీటకాలు ఇలా ఏదొకటి ప్రత్యక్షమవుతున్న ఘటనలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి అనుభవమే ఢిల్లీకి చెందిన వ్యక్తికి ఎదురైంది. అతడు ఆర్డర్ చేసిన కాఫీలో చికెన్ ముక్క వచ్చింది. ఆ విషయం గుర్తించని ఆ వ్యక్తి, ఆయన భార్య కాఫీని తాగేశారు. చివరిలో కాఫీ కప్పులో చికెన్ ముక్క ఉండటం చూసి వారిద్దరూ షాకయ్యారు. వెంటనే తనకు ఎదురైన అనుభవాన్ని తెలియజేస్తూ సుమిత్ అనే ట్విట్టర్ యూజర్ ఆర్డర్ చేసిన కాఫీ, చికెన్ ముక్క ఉన్న ఫొటోను షేర్ చేశాడు.

సుమిత్ సౌరభ్ జూన్ 3న ఈ పోస్టు చేశాడు. ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ నుంచి కాఫీని జొమాటో ద్వారా ఆర్డర్ చేశాడు. శాకాహారి అయిన అతని భార్య కాఫీ రుచి చూశాక అందులో చిన్న చికెన్ ముక్క కనిపించింది. కాఫీ కప్పు మూతపై ఉన్న ముక్కతో ఉన్న ఫొటోను సుమిత్ పోస్ట్ చేశాడు. “@zomato, @thirdwaveindia నుంచి కాఫీని ఆర్డర్ చేసాను. ఇది చాలా ఎక్కువ. కాఫీలో ఒక చికెన్ ముక్క. దయనీయమైనది. మీతో నా అనుబంధం ఈరోజు అధికారికంగా ముగిసింది” అని పోస్ట్ క్యాప్షన్ పెట్టాడు.

సుమిత్ ఈ స్క్రీన్‌షాట్‌ను జొమాటోకు కూడా షేర్ చేశాడు. ఫుడ్ డెలివరీ యాప్ జరిగిన పొరపాటునకు విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు కోరింది. తప్పిదానికి చింతిస్తూ తనకు ప్రో మెంబర్‌షిప్‌ అందిస్తామని ఆఫర్ ఇచ్చిందని తెలియజేశారు. మీ వివరాలను DM ద్వారా షేర్ చేయమని కోరింది. తమ టీం వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుందని తెలిపింది. ఈ పోస్టును చూసిన నెటిజన్లు జొమాటో తీరుపై మండిపడుతున్నారు.


Read Also : Uttar Pradesh : ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. చీమలు కరవడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న శిశువు మృతి

ట్రెండింగ్ వార్తలు