Rape: నాలుగేళ్ల చిన్నారిపై యువకుడి అత్యాచారం

మధ్యప్రదేశ్​ రాష్ట్రంలో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరగగా..నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సోమవారం పోలీసులు

Rape: నాలుగేళ్ల చిన్నారిపై యువకుడి అత్యాచారం

Mp

Updated On : December 13, 2021 / 4:43 PM IST

Man Rapes 4 Year Old Girl మధ్యప్రదేశ్​ రాష్ట్రంలో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరగగా..నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సోమవారం పోలీసులు తెలిపారు.

రేవా జిల్లాలో ఆదివారం సాయంత్రం ఇంటిబయట ఆడుకుంటున్న బాధిత చిన్నారిని చాక్లెట్ ఆశ చూపించి తన ఇంటికి తీసుకెళ్లి 22 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడని స్థానిక పోలీస్ ఇన్స్ పెక్టర్ దిలీప్ దహియా తెలిపారు. నిందితుడి ఇంటి నుంచి బయటకు వచ్చిన చిన్నారి..ఏడుస్తూ తల్లిదండ్రులతో ఈ విషయం చెప్పిందని, దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడుని అరెస్ట్​ చేసినట్లు తెలిపారు.

నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్ ఇన్స్ పెక్టర్ దిలీప్ దహియా తెలిపారు. ఇక, బాధిత చిన్నారిని ట్రీట్మెంట్ కోసం స్థానిక హాస్పిటల్ కు తరలించారు. ఎటువంటి ప్రాణాపాయం లేదని, బాలిక ఆరోగ్యంగానే ఉందని డాక్టర్లు తెలిపారు.

ALSO READ DRDO : స్మార్ట్ మిసైల్ పరీక్ష విజయవంతం