Mother
Man Sentenced To Death : ఓ ఘటనతో సభ్యసమాజం ఉలిక్కిపడింది. ఒళ్లు జలదరించేలా..అత్యంత దారుణమైన జరిగిన ఓ ఘటనలో ఓ వ్యక్తికి మరణ శిక్ష విధించింది. చనిపోయే వరకు ఉరి తీయాలని కోర్టు ఆదేశించింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. 2017 సంవత్సరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి..కోర్టు అందరూ ఊహించినట్టే తీర్పునిచ్చింది. చనిపోయే వరకు ఉరి తీయాలని ఆదేశించింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్ లోకల్ కోర్టులో ఓ కేసు విచారణ జరుగుతోంది. 2017 ఆగస్టులో సునీల్ రామ కుచ్కోరవి తల్లిని హత్య చేశాడు.
Read More : Actress Pratyusha Paul : నటికి అత్యాచార బెదిరింపులు
ఈ సమయంలో..ఓ పిల్లవాడు రక్తపు మరకలతో డెడ్ బాడీని చూసి బిగ్గరగా ఏడ్చాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందివ్వడంతో ఘటనా ప్రదేశాన్ని చూసి షాక్ తిన్నారు. మనిషేనా ? అని అనుకున్నారు. పోలీస్ ఇన్స్ పెక్టర్ భూసాహెబ్ కు ద్రిగ్భాంతికర విషయాలు కనిపించాయి. రక్తపు మడుగులో ఉన్న మృతదేహం గుండె ఓ ప్లేట్ లో ఉంటే..మరికొన్ని అవయవాలు అక్కడున్న పొయ్యిలో ఉండడంతో అందరూ హఢలిపోయారు. వెంటనే నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ ఘటనపై జడ్జి మహేష్ కృష్ణజీ జాదవ్ తీర్పునిచ్చారు. ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేశారు. ఓ హత్యే కాదు..కరడుగట్టిన క్రూరత్వంగా అభివర్ణించారు. మద్యానికి బానిసై నేరానికి పాల్పడ్డాడని, నిందితుడిలో కనీసం పశ్చాతాపం కనబడడం లేదని తెలిపారు. చనిపోయిన ఆమె బాధను మాటలో చెప్పలేమని, నిందితుడిని మృతి చెందే వరకు ఉరి తీయాలని ఆదేశించారు.