Actress Pratyusha Paul : నటికి అత్యాచార బెదిరింపులు

బెంగాలీ టీవీ నటి ప్రత్యూష‌పాల్‌ ఇటీవల అత్యాచార బెదిరింపులు ఎదుర్కోన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఫోటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి ఇన్‌స్టా‌గ్రాంలో పోస్ట్ చేయటం మొదలెట్టారు.

Actress Pratyusha Paul : నటికి అత్యాచార బెదిరింపులు

Bengali Actress Pratyusha Paul

Actress Pratyusha Paul : బెంగాలీ టీవీ నటి ప్రత్యూష‌పాల్‌ ఇటీవల అత్యాచార బెదిరింపులు ఎదుర్కోన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఫోటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి ఇన్‌స్టా‌గ్రాంలో పోస్ట్ చేయటం మొదలెట్టారు. దీంతో ఆమె కొల్‌కతా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తన ఫోటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి, అసభ్యకరమైన కామెంట్లతో గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు ఆమె శనివారం విలేకరులకు తెలిపారు. గతేడాది కాలంగా ఈ పోస్టులు వస్తున్నాయని… మొదట్లో వీటిని చూసి చూడనట్టు వదిలేసినా రాన్రాను వారి ఆగడాలు పెచ్చు మీరుతుండటంతో సోషల్ మీడియాలో అతని ఎకౌంట్ బ్లాక్ చేసినట్లు ఆమె వివరించారు.

ఒక ఎకౌంట్ బ్లాక్ చేసినా మరోక కొత్త ఎకౌంట్ ఓపెన్ చేసి దాని ద్వారా అశ్లీల ఫోటోలు పంపుతూ అత్యాచారం చేస్తానని బెదిరిస్తున్నాడని చెప్పారు. మార్ఫింగ్ చేసిన ఫోటోలను తన తల్లికి, చెల్లికి కూడా పంపించి మానసిక వేదనకు గురి చేశారని ఆమె వాపోయారు. గతేడాది కాలంలో అసభ్య, అశ్లీల మెసేజ్‌లు, ఫోటోలు వచ్చే   30 ఎకౌంట్లను బ్లాక్ చేసినట్లు నటి చెప్పారు.

బ్లాక్ చేసిన ప్రతి సారి మరోక కొత్త ఎకౌంట్ నుంచి ఫోటోలు పంపించటం మొదలెట్టటంతో   విసిగిపోయి ఆమె తన తల్లితో కలిసి కోల్‌కతా‌లోని సైబర్ క్రైం పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 66సి/67/ఎ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ఆర్ డబ్ల్యూ సెక్షన్ 3545 ఏ/354డి./506/509కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.