లోన్ ఇవ్వలేదని:  బ్యాంక్ ఉద్యోగి చెంప ఛెళ్లు మనిపించాడు 

  • Publish Date - August 26, 2019 / 07:45 AM IST

చుక్కలనంటుతున్న భూముల ధరలతో సామాన్యుడు స్వంత ఇల్లు తీరని కలగా మిగిలిపోతోంది. రూపాయి రూపాయి కూడబెట్టుకుని స్వంత ఇల్లు ఏర్పరచుకోవటానికి నానా అగచాట్లు పడుతున్నాడు సామాన్యుడు. దీంతో కొద్దో గొప్పో కూడబెట్టుకున్న డబ్బుకు తోడు..బ్యాంక్ లో లోన్ తీసుకుంటే స్వంత ఇల్లు కల సాకారం  అవుతుందని ఆశపడుంటాడు. దీంతో బ్యాంకులను ఆశ్రయిస్తుంటాడు. బ్యాంక్ సిబ్బంది పదే పదే తిప్పుకుని చివరికి లోన్ రాదు పొమ్మంటే సామాన్యుడి కూడా కోపం వస్తుంది. అలా కోపమొచ్చిన ఓ వ్యక్తి బ్యాంకు ఉద్యోగిని చెంప ఛెళ్లు మనిపించాడు. ఈ ఘటప కర్ణాటక రాష్ట్రంలో విజయపురలో చోటుచేసుకుంది. 

విజయపురలో కేవీజీ బ్యాంక్ ఉంది. రోజులాగానే బ్యాంక్ సిబ్బంది వచ్చిన కస్టమర్లతో బిజీగా ఉన్నారు. అప్పుడే హఠాత్తుగా ఓ ఘటన జరిగింది. బ్యాంకులో ఉన్న ఓ వ్యక్తి సడెన్ గా రియాక్ట్ అయ్యాడు. బ్యాంక్ ఉద్యోగి చెంపపై చెళ్లు మంటు ఒక్కటిచ్చాడు.

ఈ దృశ్యాలన్నీ బ్యాంక్ లో ఉన్న సీసీ టీవీ లో రికార్డయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీనికి కారణం ఏమంటే..ఇంటి లోన్ కోసం వచ్చిన ఓ కస్టమర్ ను పదే పదే తిప్పించుకున్నారు. తరువాత తాపీగా లోన్ ఇవ్వటం కుదరదీ చెప్పారు. దీంతో ఒళ్లు మండిన సదరు కస్టమర్ బ్యాంక్ ఉద్యోగి చెంప చెళ్లు మనిపించాడు. దీంతో సదరు ఉద్యోగి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులవిచారణలో సదరు కష్టమన్ ఇదే విషయాన్నితెలిపాడు.