Man Kill In Delhi : ఢిల్లీలోని అలీ విహార్ ఏరియాలో దారుణం జరిగింది. వ్యక్తిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. చిన్న గొడవను మనసులో పెట్టుకుని బైకులపై వచ్చిన మూక వ్యక్తిని కత్తులతో పొడిచి చంపారు. అతని ఒంటిపై మొత్తం కత్తిపోట్లు పడ్డాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అలీ విహార్ ఏరియాకు చెందిన అర్వింద్ మండల్ శుక్రవారం సాయంత్రం తన కొడుకును స్కూల్ నుంచి తీసుకొని వస్తుండగా ఓ వ్యక్తి బాలుడిని ఉద్దేశించి దుర్భాషలాడారు.
దీంతో అర్వింద్ మండల్ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత అర్వింద్ తన కొడుకుతో కలిసి ఇంటికి వస్తుండగా నిందితుడు తన స్నేహితులతో కలిసి మరోసారి అడ్డగించారు. దీంతో వారి మధ్య కొంతసేపు వాగ్వాదం జరుగుగా స్థానికులు జోక్యం చేసుకుని ఇరువురికి సర్ది చెప్పారు. అనంతరం అర్వింద్ మడల్ రాత్రి 9.40 గంటల సమయంలో ఇంటి ముందు నిలబడి ఉన్నాడు.
Delhi Murder: ఢిల్లీలో దారుణం.. ముప్పై రూపాయల కోసం వ్యక్తి హత్య.. నిందితుల అరెస్ట్
ఈ క్రమంలో నిందితుడు తన స్నేహితులతో కలిసి బైకులపై వచ్చి దాడి చేశాడు. కత్తులతో అర్వింద్ ను విచక్షణారహితంగా పొడిచారు. భర్తను రక్షించేందుకు వెళ్లిన భార్య రేఖా మండల్ పై దాడి చేశారు. రాడ్ తో ఆమె తల పగులగొట్టారు. స్థానికలు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వెంటనే ఘటనా ఘటనాస్థలికి చేరుకునే సరికి నిందితులు పరారయ్యారు.
తీవ్ర గాయాలతో ఉన్న అర్వింద్ మండల్, రేఖా మండల్ లను చికిత్స కోసం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. రేఖా మండల్ పరిస్ధితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి విచారిస్తున్నారు.