డెహ్రాడూన్ లో ఓ వ్యక్తి రెండు చేతుల్లో తుపాకులను పట్టుకుని డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదివరకు కూడా ఉత్తరాఖాండ్ లో ఇలాంటి ఘటణలు జరిగాయి. బీజేపీ ఎమ్మెల్యే కున్వర్ ప్రణవ్ సింగ్ బాగా తాగి.. ఆ మత్తులో తుపాకులతో డ్యాన్స్ చేస్తూ మీడియాకు చిక్కారు.
వివరాలు.. 40 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి తన ఇంట్లో రెండు చేతుల్లో రెండు తుపాకులను పట్టుకుని వీడియో తీసుకుంటూ హిందీ పాటకు డ్యాన్స్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా.. ఉత్తరాఖండ్ పోలీసుల దాకా చేరింది. అనంతరం ఉత్తరాఖండ్ పోలీసులు ఈ డ్యాన్స్ వీడియో పై స్పందించారు.
సర్కిల్ ఆఫీసర్ అభయ్ సింగ్ మాట్లాడుతూ.. ఈ వీడియో హరిద్వార్ నుంచి వచ్చిందా? లేక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిందా? అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
Haridwar: In a video, a man was seen dancing while carrying 2 guns. Circle officer (CO) Abhay Singh says, “We’ll get the video verified and get the facts checked. Action will be taken, based on facts. We’ll also find out if the video is from Haridwar or outside. #Uttarakhand pic.twitter.com/DpCsz3atKQ
— ANI (@ANI) October 16, 2019