మహిళా సర్పంచ్ :కూల్చివేతల్ని అడ్డుకోవటానికి JCB ఎక్కేసింది

  • Publish Date - November 22, 2019 / 11:27 AM IST

ఓ మహిళా సర్పంచ్ విచిత్ర నిరసన చూస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తు ఆమె చేసిన పని అందరి దృష్టిని ఆకర్షించింది. తన నిరసన వినూత్నంగా వ్యక్తం చేసింది. కాస్తంత భయపెట్టేలా..ఇంకాస్త ఆశ్చర్యం కలిగించే మహిళా సర్పంచ్ చేసిన ఈ విచిత్రమైన నిరసన రాజస్థాన్ జలోర్ జిల్లాలోని మందవాలా గ్రామంలో జరిగింది. 

గ్రామంలో అక్రమ కట్టడాల కూల్చివేత కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. అయితే అక్రమ కట్టడాలను కూల్చివేయొద్దంటూ ఆ గ్రామ సర్పంచ్ రేఖా దేవీ కట్టడాల్ని కూల్చటానికి వచ్చిన జేసీబీ యంత్రాన్ని ఎక్కేందుకు ప్రయత్నించింది. ఎలాగైతేనే ఎగిరి జేసీబీని పట్టుకుంది. కాసేపు గాల్లో వేలాడింది. దీంతో అక్కడున్న అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆమెకు ఏమవుతుందోనని కంగారుపడ్డారు. వారించి కిందకు దించారు. కానీ ఆమె మరోసారి ఎగిరి దాన్ని పట్టుకుంది.

మొత్తానికి ఎలాగైతేనే..జేసీబీ యంత్రం కిందకు దించి ఆమెను కొందరు కిందకు దించారు. ఎలాగైతేనే సర్పంచ్ రేఖాదేవి తెలిపిన విచిత్రమైన నిరసనతో జేసీబీ డ్రైవర్ హడలిపోయాడు. వెనక్కి పోనిచ్చాడు. అలా ఈ వీడియో సోషల్ మీడియాలో వైలర్ గా మారింది. హా..ఏమి ఈ మహిళా సర్పంచ్ ధైర్యం..తెగువ అని ఆశ్చర్యపోతున్నారు.