No Mask Doctor
Doctor who refused to wear a mask : కరోనా మహమ్మారికి విజృంభిస్తున్న కల్లోల సమయం. మాస్కులు ధరించడం, భౌతిక దూరం, శానిటైజేషన్ వంటివాటిని తప్పనిసరిగా పాటించాల్సిన రోజులు. కానీ..అందరికీ చెప్పాల్సిన ఓ డాక్టర్ మాత్రం ‘‘నేను మాస్కు పెట్టుకోను ఏంచేస్తారు?’’ అంటూ పబ్లిక్ ప్లేస్ లో నానా రచ్చా చేశాడు. దీంతో సూపర్ మార్కెట్ నిర్వాహకులు సార్ మాస్కు పెట్టుకోండీ అని సూచించగా వారితో గొడవకు దిగాడు. పక్కనున్నవారు కూడా ‘అదేంటీ సార్..మాస్కు తప్పనిసరి కదా..మీరలా అంటారేంటీ..మాస్కు పెట్టుకోండీ’ అని చెప్పిన పాపానికి వారి మీద కూడా గొడవకు దిగాడా ఆ సదరు డాక్టరోత్తముడు.
మంగళూరుకు చెందిన బి. శ్రీనివాస్ కక్కిలియా అనే డాక్టర్..రెండు రోజుల క్రితం నగరంలోని ఓ సూపర్‌మార్కెట్‌కు వెళ్లాడు. అతడు మాస్కు ధరించకపోవడంతో మార్కెట్ సిబ్బంది ‘సార్ మాస్కు పెట్టుకోండీ సార్‘ అని చెప్పారు. కానీ అతను ససేమిరా అన్నాడు. ఎన్నిసార్లు మర్యాదగా చెప్పినా..మాస్కు ధరించేది లేదనీ మొండికేశాడు. పైగా మార్కెట్ సిబ్బందితో గొడవకు దిగాడు. షాపింగ్ చేయటం మానలేదు. పక్కనున్నవారు కూడా మాస్కు పెట్టుకోమని చెప్పినా వినకుండా వారితో కూడా వాదానికి దిగాడు. దాంతో సూపర్ మార్కెట్ వాళ్లకు ఏంచేయాలో తెలీయలేదు.
దాంతో చేసేదేమీ లేక..పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సూపర్ మార్కెట్ కు వచ్చిన పోలీసులు డాక్టర్‌ను అరెస్టు చేసి..ఎపిడెమిక్ యాక్ట్ కింద కేసు నమోదుచేశారు. దీనిపై డాక్టర్ ను పోలీసులు విచారించగా..‘‘నాకు ఎటువంటి కరోనా లక్షణాలు లేవు..అటువంటప్పుడు నేను మాస్కు ధరించాల్సిన అవసరం ఏముంది? అంటూ ఎదురు ప్రశ్నించాడు. కాగా డా. శ్రీనివాస్ గతంలో కూడా మాస్కు పెట్టుకోవటం ఓ ఫూలిష్ రూల్ అని విమర్శలు ఎదుర్కొన్నాడు.