మన్మోహన్ సింగ్ మెమోరియల్ వివాదంపై కేంద్రం కీలక ప్రకటన

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మెమోరియల్ వివాదంపై కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మెమోరియల్ ఏర్పాటు స్థలం కేటాయించాలని

Manmohan Singh

Manmohan Singh Funeral: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలవేళ ఆయన స్మారక చిహ్నం ఏర్పాటు విషయంపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశంలోనే మన్మోహన్ కు స్మారక చిహ్నం నిర్మించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. ఈ మేరకు ఆ లేఖలో తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. భారత ప్రజల హృదయాల్లో మన్మోహన్ సింగ్ అత్యంత గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించారని, ఆయన సేవలు, సాధించిన విజయాలు అపూర్వమైనవి అంటూ ఖర్గే పేర్కొన్నారు. ఖర్గే లేఖపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. స్మారకాలను నిర్మించే సంప్రదాయాల గురించి మోదీకి కాంగ్రెస్ లేఖ రాయడం విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవా చేశారు.

Also Read: Manmohan Singh: మన్మోహన్ సింగ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? ఆయన ముగ్గురు కుమార్తెలు ఏం చేస్తున్నారంటే..

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మెమోరియల్ వివాదంపై కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మెమోరియల్ ఏర్పాటు స్థలం కేటాయించాలని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కోరారు. కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే ఖర్గేకు కేంద్ర హోమంత్రి అమిత్ షా ఈ మేరకు బదులిచ్చారు. స్థలం ఏర్పాటు చేయాలంటే ముందు ట్రస్టు ఏర్పాటు చేయాలి. ఆ ట్రస్టు పేరిట స్థలాన్ని కేటాయించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ముందు అంత్యక్రియలు పూర్తిచేసి, తర్వాత మోమోరియల్ కోసం స్థలాన్ని కేటాయిస్తామని ఖర్గేకు, మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు చెప్పామని కేంద్రం ప్రకటనలో పేర్కొంది.

Also Read: Nitish Kumar Reddy father : నితీష్ కుమార్ రెడ్డి సూప‌ర్ సెంచ‌రీ.. క‌న్నీళ్లు పెట్టుకున్న తండ్రి.. వీడియో వైర‌ల్‌

మరోవైపు కాంగ్రెస్ తీరుపై ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ విమర్శలు గుప్పించారు. ప్రణబ్ ముఖర్జీ మరణించినప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కాలేదని, రాష్ట్రపతులుగా పనిచేసినవారి విషయంలో సీడబ్ల్యూసీ సంతాపం తెలపడం ఆనవాయితీగా లేదని ఓ సీనియర్ నేత చెప్పారని శర్మిష్ట ముఖర్జీ పేర్కొన్నారు. కానీ, కేఆర్ నారాయణన్ మృతి చెందినప్పుడు సీడబ్ల్యూసీ సమావేశమై సంతాపం తెలియజేసిందని గుర్తు చేశారు. అప్పుడు సంతాప సందేశాన్ని నా తండ్రి ప్రణబ్ ముఖర్జీయే డ్రాప్ట్ చేశారని ఆమె పేర్కొన్నారు.

తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. మాజీ ప్రధానికి ఇవ్వాల్సిన గౌరవం కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ కు ఇవ్వడం లేదని ఆరోపించారు. స్మారక స్థలంలో అంత్యక్రియలు జరుపకపోవడం బాధాకరమన్న జూపల్లి.. మన్మోహన్ సింగ్ కు కేంద్రం భారతరత్న ఇచ్చి గౌరవించాలని డిమాండ్ చేశారు.