గెట్ అవుట్ ఫ్రమ్ ఢిల్లీ : బీజేపీ చీఫ్ పై కేజ్రీవాల్ ఆగ్రహం

ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ ఢిల్లీ వదిలి వెళ్లాలన్నారు సీఎం కేజ్రీవాల్. దేశ రాజధానిలో కనుక NRC(నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్)నిర్వహిస్తే మొట్టమొదటిగా బీహార్ లో పుట్టిన మనోజ్ తివారీ ఢిల్లీ వదిలి వెళ్లాల్సిన అవసరముందన్నారు. అస్సాంలో జరిగిన మాదిరిగానే ఇతర ప్రాంతాల్లో NRC ప్రక్రియ నిర్వహించాలంటూ తరచుగా మనోజ్ తివారీ వ్యాఖ్యానిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం సాయంత్రం ఢిల్లీలో ఓ మహిళా జర్నలిస్టుపై జరిగిన దాడి చొరబాటుదారులచే చేయబడించిన తివారీ మరోసారి తన డిమాండ్ ను రిపీట్ చేశారు.

తివారీ డిమాండ్ పై కేజ్రీవాల్ ను జర్నలిస్టులు ప్రశ్నించగా…ఢిల్లీలో NRC నిర్వహిస్తే ఫస్ట్ మనోజ్ తివారీ ఢిల్లీ వదిలి వెళ్లాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తివారీ బీహార్ లో పుట్టాడని తెలిపారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా తీవ్రంగా స్పందించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. NRCపై ఆయన కామెంట్ అర్థరహితమన్నారు. NRC లో Nఅంటే నేషనల్ కోసం అని కొంతమంది అర్థం చేసుకోలేదన్నారు. బంగ్లాదేశ్,రోహింగ్య శరణార్థుల ఓట్లు పొందేందుకు కేజ్రీవాల్ ఇలా చేస్తున్నారన్నారు. మొత్తానికి త్వరలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో NRC ఒక ముఖ్యమైన ఎన్నికల అంశంగా మారనుందనటంలో సందేహం లేదని చెప్పవచ్చు.