Dantewada: భారీ సొరంగాన్ని నిర్మించుకున్న మావోయిస్టులు

వీటి నుంచే మావోయిస్టులు వచ్చి నిన్న భద్రతా బలగాలపై ఎదురు కాల్పులు జరిపి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

Dantewada

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలోనూ మావోయిస్టులు భారీ సొరంగాలు ఏర్పాటు చేసుకున్నారు. వీటిని పోలీసులు తాజాగా గుర్తించారు. సొరంగంలోకి బయటి నుంచి గాలి, వెలుతురు వచ్చేలా మావోయిస్టులు వీటిని నిర్మించుకున్నారు.

వీటి నుంచే మావోయిస్టులు వచ్చి నిన్న భద్రతా బలగాలపై ఎదురు కాల్పులు జరిపి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌ సుక్మా-బీజాపూర్‌ జిల్లాల సరిహద్దులో నిన్న భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. దీంతో ముగ్గురు జవాన్లు మృతి చెందగా, మరో 15 మందికి గాయాలయ్యాయి.

ఆరుగురు మావోయిస్టులు కూడా మృతి చెందినట్లు పోలీసులు అంటున్నారు. మావోయిస్టుల కోసం గాలిస్తూ టేకులగూడెం అటవీ ప్రాంతంలో ఇటీవలే ప్రభుత్వం పోలీసుల శిబిరాన్ని ఏర్పాటు చేసిం కూంబింగ్‌ సమయంలో భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు.

దంతెవాడ జిల్లాలోనూ నిన్న ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టులు బ్యారెల్‌ గ్రెనేడ్‌ లాంచర్లనూ వాడినట్లు తెలుస్తోంది. అలాగే, సుక్మా-బీజాపూర్‌ జిల్లాల సరిహద్దుల్లో ఐదు కిలోల ఐఈడీ బాంబులను భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి.

హైదరాబాద్ ఆర్టీసీ బస్సులో యువతి హల్‌చ‌ల్‌.. ఖండించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్

ట్రెండింగ్ వార్తలు