Masks for Children : కేంద్రం కొత్త గైడ్‌లైన్స్.. 5ఏళ్ల లోపు చిన్నారులకు మాస్క్ అక్కర్లేదు!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవడంతో పాటు మాస్క్ ధరించాలని కేంద్ర ప్రభుత్వం సూచనలు చేస్తోంది.

Masks for Children : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవడంతో పాటు మాస్క్ ధరించాలని కేంద్ర ప్రభుత్వం సూచనలు చేస్తోంది. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలని సూచిస్తోంది. అయితే మాస్క్ లు ధరించే విషయంలో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ఐదేళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సు కలిగిన చిన్నారులకు మాస్క్ తప్పనిసరి కాదని కేంద్రం స్పష్టం చేసింది. తల్లిదండ్రుల ప్రత్యక్ష పర్యవేక్షణ సమయంలో మాత్రమే ఆరేళ్ల నుంచి 11ఏళ్ల వయస్సు పిల్లలు మాత్రమే మాస్క్ ధరించేలా చూడాలని సూచించింది. ప్రతీఒక్కరు మాత్రం జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

12 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు పెద్దల మాదిరిగానే మాస్క్ ధరించాలని తెలిపింది. ఇతర దేశాల నుంచి అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. ఒమిక్రాన్‌ వేరియంట్ వల్ల వచ్చే వ్యాధి తీవ్రగా తక్కువ ఉందని కేంద్రం వెల్లడించింది. కోవిడ్ ఇన్ఫెక్షన్ తీవ్రతతో సంబంధం లేకుండా 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి యాంటీవైరల్ లేదా మోనోక్లోనల్ యాంటీబాడీస్ వాడొద్దని సూచించింది. ఒకవేళ తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారికి స్టెరాయిడ్స్ వాడినట్లయితే.. వైద్యపరంగా లోబడి 10రోజుల నుంచి 14 రోజులలోపు స్టెరాయిడ్స్ వాడకాన్ని తగ్గించాలని ప్రభుత్వం తెలిపింది.

ప్రస్తుత కరోనా ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని నిపుణుల బృందం మార్గదర్శకాలను సమీక్షించింది. కోవిడ్-19 సవరించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం.. కౌమారదశలో (18 ఏళ్లలోపు) ఐదేళ్లు.. అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు మాస్క్‌లు అవసరం లేదు. ఒమిక్రాన్.. లక్షణరహిత, తేలికపాటి, మితమైన తీవ్రమైన కేసులుగా వర్గీకరించింది. 18 ఏళ్లలోపు వయసు వారికి కోవిడ్-19 చికిత్స కోసం కొత్త గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది ఐసీఎంఆర్‌. కోవిడ్ ఇన్ఫెక్షన్ తీవ్రతతో సంబంధం లేకుండా 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి యాంటీవైరల్ లేదా మోనోక్లోనల్ యాంటీబాడీస్ వాడొద్దని ICMR తేల్చేసింది.

12ఏళ్లు దాటితే.. డబుల్ మాస్క్ మస్ట్ :
ఒమిక్రాన్‌ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు 12ఏళ్లు దాటిన పిల్లలంతా డబుల్‌ మాస్క్‌ వాడాలని సూచించింది. స్టెరాయిడ్స్ సరైన సమయంలో, సరైన మోతాదులో సరైన వ్యవధిలో వాడాలని తెలిపింది. రోజువారీ ప్రాతిపదికన క్లినికల్ అసెస్‌మెంట్‌ను బట్టి వాటిని ఐదు నుంచి ఏడు రోజులు కొనసాగించవచ్చు. 10-14 రోజుల వరకు తగ్గించవచ్చునని పేర్కొంది. లక్షణాలు ప్రారంభమైనప్పటి నుంచి మొదటి మూడు నుండి ఐదు రోజులలో స్టెరాయిడ్లకు దూరంగా ఉండాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఆస్పత్రిలో చేరిన పిల్లలందరికీ థ్రాంబోసిస్ వచ్చే ప్రమాదం ఉందని.. పిల్లలను పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

Read Also: Fever Survey: తెలంగాణలో ఫీవర్ సర్వే, లక్షణాలు ఉంటే వైద్య కిట్లు అందజేత

ట్రెండింగ్ వార్తలు