Avalanche In Sikkim: భారీ హిమపాతం.. ఆరుగురి మృతి.. మంచు కిందే మరో 80 మంది

మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. భారీ హిమపాతం సంభవించిన ప్రాంతంలో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

Avalanche In Sikkim

Avalanche In Sikkim: సిక్కింలోని నాథూలా పర్వత ప్రాంతంలో భారీ హిమపాతం ధాటికి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 22 మందిని సిక్కిం పోలీసులు, పర్యాటక శాఖ సిబ్బంది రక్షించారు. పర్యాటకుల్లో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిని దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు. హిమపాతం కింద ఇంకా 80 మంది చిక్కుకుని ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు.

ఇవాళ మధ్యాహ్నం 12.20 గంటలకు ఈ హిమపాతం సంభవించిందని అధికారులు వివరించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గాంగ్టక్ కు అనుసంధానమై ఉన్న జవహర్ లాల్ నెహ్రూ రోడ్డుకి సమీపంలో హిమపాతం సంభవించింది. రోడ్డుపై మంచును తొలగించి చాలా మంది పర్యాటకులను సహాయక సిబ్బంది కాపాడారు.

మొత్తం 80 పర్యాటకుల వాహనాలు ఆ సమయంలో అక్కడ ఉన్నాయి. పర్వత ప్రాంతంలో సూచించిన దూరాన్ని దాటి వెళ్లకూడదని పర్యాటకుల విషయంలో నిబంధనలు ఉన్నాయని, అయితే, టూరిస్టులు ఆ నిబంధనలను ఉల్లంఘించి ముందుకు వెళ్లారని అధికారులు చెప్పారు.

Odisha: పని చేయించుకుని డబ్బులు ఇవ్వలేదు.. కాలినడకన కర్ణాటక నుంచి ఒడిశాకు వలస కూలీలు