Odisha: పని చేయించుకుని డబ్బులు ఇవ్వలేదు.. కాలినడకన కర్ణాటక నుంచి ఒడిశాకు వలస కూలీలు

మార్చి 26న బెంగళూరు నుంచి ప్రయాణం ప్రారంభించారట. కోరపుట్‭కు ఏప్రిల్ 2న చేరుకున్నారు. చేతిలో డబ్బులు లేవు, తినడానికి తిండిలేదు. ఇంటిని చేరితే అదే పదివేలన్న ఆకరి ఆశతో వెయ్యి కిలోమీటర్లు కాలినడకనే వచ్చారు. కోరపుట్‭ ప్రాంతంలోని పొట్టంగి స్థానికులు వారిని చూసి ఆ వలస కార్మికుల స్వగ్రామమైన కలహండిని చేరేందుకు సహాయం చేశారట.

Odisha: పని చేయించుకుని డబ్బులు ఇవ్వలేదు.. కాలినడకన కర్ణాటక నుంచి ఒడిశాకు వలస కూలీలు

migrant workers walking

Odisha: లాక్‭డౌన్ సమయంలో వలస కూలీల అవస్థల గురించి ప్రత్యక్షంగా చూసే ఉంటాము. పని పోయింది. పైసా లేదు. వైరస్ భయానికి అద్దె ఇంటివారు వెల్లగొట్టారు. ఇక ఏ దిక్కూ లేక కన్న ఊరికి వెళ్దామంటే రవాణా లేదు. కడుపు చేతిలో పట్టుకుని కాలినడకన వెళ్లిన వేలాది వలస కూలీల తిప్పలు ఎప్పుడు తలుచుకున్నా, మనసు ఒక్కసారి చివుక్కుమంటుంది. అచ్చం అలాంటి పరిస్థితే ఒక ముగ్గురు వలస కూలీలకు తాజాగా వచ్చింది.

Secunderabad : రూ.715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ

పని చేయించుకున్న దగ్గర డబ్బులు ఇవ్వలేదు. దీంతో చేతిలో చిల్లిగవ్వ లేక కాలినడకనే ఇంటికి బయల్దేరారు. అది కూడా కర్ణాటక నుంచి ఒడిశాకు. సుమారు 1,000 కిలోమీటర్లు కాలినడకనే వెళ్లేందుకు సిద్ధమయ్యారు. చేతిలో కేవలం నీళ్ల డబ్బాలు తప్ప వారి దగ్గర ఏమీ లేదు. బెంగళూరు నుంచి బయల్దేరిన ఆ ముగ్గురు వలస కార్మికులు ఎట్టకేలకు వారం రోజుల ప్రయాణం అనంతరం ఆదివారం ఒడిశాలోని కోరపుట్‭కు చేరుకున్నారు.

Delhi : డీజే సౌండ్ తగ్గించమని కోరిన గర్భిణిపై కాల్పులు జరిపిన యువకుడు .. గర్భస్రావం కావటంతో పరిస్థితి విషమం