Dilli Haat : ఢిల్లీ హాట్‌ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం.. 26 షాపులు ధ్వంసం.. ఫుల్ డిటెయిల్స్..!

Dilli Haat : ఢిల్లీ హాట్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో దాదాపు 26 షాపులు మంటల్లో దగ్ధమయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.

Dilli Haat : Photo Credit : ANI (X)

Dilli Haat : దేశ రాజధానిలోని ఐఎన్‌ఎ వద్ద ఢిల్లీ హాట్‌లో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగిన తర్వాత 14 అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగాయి. ఈ అగ్నిప్రమాదంలో 26 దుకాణాలు కాలి బూడిదయ్యాయి.

Read Also : TG Inter Admissions : తెలంగాణ ఇంటర్ అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల.. అకాడమిక్ కొత్త షెడ్యూల్ ఇదే..!

సహాయక చర్యల్లో కొంతమందికి స్వల్పంగా గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత వ్యాపారులకు ఢిల్లీ ప్రభుత్వం నుంచి సాధ్యమైనంత సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

రాత్రి 9 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. మంటలు పూర్తిగా ఆరిన తర్వాత సెర్చ్ ఆపరేషన్ ప్రారంభిస్తామని పోలీసులు చెబుతున్నారు. అగ్నిప్రమాదంపై రాత్రి 9 గంటల ప్రాంతంలో సమాచారం అందిందని అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు తెలిపారు.

అగ్నిమాపక దళం వాహనాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ఈ సమయంలో, సరోజిని నగర్ పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో మార్కెట్లో జనసమూహం లేకపోవడం ప్రాణనష్టం వాటిల్లలేదు. సకాలంలో మంటలు వ్యాపించకుండా నిరోధించినట్టు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.

ఢిల్లీ హాట్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా మాట్లాడుతూ.. అగ్నిప్రమాదం సమాచారం అందిన వెంటనే అధికారులు, అగ్నిమాపక వాహనాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ఈ అగ్నిప్రమాదంలో దాదాపు 26 దుకాణాలు కాలిపోయాయి.

Read Also : Bank Holidays May 2025 : బిగ్ అలర్ట్.. మేలో బ్యాంకు పని ఉందా? ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయంటే? ఫుల్ లిస్టు మీకోసం..!

ఫుడ్ ప్లాజా వైపు ఉన్న మరికొన్ని దుకాణాలు కూడా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ప్రమాదంపై దర్యాప్తు జరుగుతుందని, బాధిత వ్యాపారులకు ఆర్థిక ఆర్థిక సాయాన్ని ఢిల్లీ ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు.