TG Inter Admissions : తెలంగాణ ఇంటర్ అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల.. అకాడమిక్ కొత్త షెడ్యూల్ ఇదే..!

TG Inter Admissions : తెలంగాణ విద్యార్థుల కోసం ఇంటర్ బోర్డు అడ్మిషన్ల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కొత్త విద్యాసంవత్సరానికి సంబంధించి అకాడమిక్ షెడ్యూల్ విడుదల చేసింది.

TG Inter Admissions : తెలంగాణ ఇంటర్ అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల.. అకాడమిక్ కొత్త షెడ్యూల్ ఇదే..!

Intermediate Admissions

Updated On : April 30, 2025 / 10:54 PM IST

TG Inter Admissions : తెలంగాణ 10వ తరగతి పరీక్షల ఫలితాల విడుదల నేపథ్యంలో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియెట్ అడ్మిషన్ల కోసం ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025-26 సంవత్సరానికి అకాడమిక్ షెడ్యూల్ విడుదల చేసింది.

Read Also : May 1st New Rules : బిగ్ అలర్ట్.. మే 1 నుంచి రానున్న కొత్త మార్పులివే.. ఏటీఎం ఛార్జీల నుంచి రైల్వే టికెట్ల వరకు.. ఫుల్ డిటెయిల్స్..!

దీని ప్రకారం.. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో మే 1 నుంచి మే 31 తారీకు వరకు కాలేజీల్లో దరఖాస్తులు చేసుకునేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డు అవకాశం కల్పిస్తోంది. ఇంటర్మీడియట్ అడ్మిషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని ఆదేశాల్లో పేర్కొంది.

ప్రతి కాలేజీలో ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 10శాతం, బీసీలకు 29శాతం, దివ్యాంగులకు 5శాతం స్పోర్ట్స్ కోట కింద 5శాతం, ఎక్స్ ఆర్మీ, డిఫెన్స్ పిల్లలకు 3శాతం, ఈడబ్ల్యుసీ కోట కింద 10శాతం సీట్లు కేటాయించాలని ఆదేశించింది.

ఇంటర్మీడియట్‌లో విద్యార్థుల అడ్మిషన్ కోసం ఎలాంటి పరీక్షలు నిర్వహించవద్దని కాలేజీలను ఇంటర్ బోర్డు ఆదేశించింది. టెన్త్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా అడ్మిషన్స్ కల్పించాలని సూచించింది.

Read Also : Tata Nano Electric Car : టాటా నానో ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోందోచ్.. సింగిల్ ఛార్జ్‌తో 250కి.మీ దూసుకెళ్లగలదు.. ధర ఎంత ఉండొచ్చుంటే?

అంతేకాదు.. అనుమతి ఉన్న మేరకే సెక్షన్స్ నిర్వహించాలని, ఒక్క సెక్షన్‌లో 88 మంది విద్యార్థులకు మాత్రమే అవకాశం కల్పించాలని పేర్కొంది. ఇన్‌స్ట్రక్షన్స్ పాటించని కాలేజీలపై కఠినమైన చర్యలు ఉంటాయని తెలంగాణ ఇంటర్ బోర్డు హెచ్చరించింది.