May 1st New Rules : బిగ్ అలర్ట్.. మే 1 నుంచి రానున్న కొత్త మార్పులివే.. ఏటీఎం ఛార్జీల నుంచి రైల్వే టికెట్ల వరకు.. ఫుల్ డిటెయిల్స్..!

May 1st New Rules : కొత్త నిబంధనలు మే 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఏటీఎం ఛార్జీల నుంచి రైల్వే టికెట్ల వరకు అన్నింటిపై మార్పులు రానున్నాయి. రాబోయే 5 కొత్త మార్పులేంటో ఓసారి లుక్కేయండి..

May 1st New Rules : బిగ్ అలర్ట్.. మే 1 నుంచి రానున్న కొత్త మార్పులివే.. ఏటీఎం ఛార్జీల నుంచి రైల్వే టికెట్ల వరకు.. ఫుల్ డిటెయిల్స్..!

May 1st New Rules

Updated On : April 30, 2025 / 9:10 PM IST

May 1st New Rules : మే 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. వచ్చే నెలలో ఏటీఎం ఛార్జీల నుంచి రైల్వే ప్రయాణాల వరకు అనేక మార్పులు జరగబోతున్నాయి. ఈ కొత్త మార్పులలో రైల్వే కొత్త నిబంధనలతోపాటు గ్రామీణ బ్యాంక్ ఫిక్స్‌‌డ్ డిపాజిట్లు, సేవింగ్ బ్యాంక్, ఏటీఎం విత్‌‍డ్రా ఛార్జీలు కూడా ఉండనున్నాయి.

Read Also : Samsung Galaxy G Fold : శాంసంగ్ లవర్స్‌కు పండగే.. ట్రిపుల్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు..!

LPG గ్యాస్ నుంచి ప్రతి నెల మొదటి తేదీ వరకు మార్పులు ఉండనున్నాయి. మే నెలలో కూడా ఎల్‌పీజీ ధరల్లో కూడా మార్పులు ఉండనున్నాయి. ఈ కొత్త నిబంధనలతో సామాన్యుడిపై మరింత ఆర్థిక భారం పడే అవకాశం కనిపిస్తోంది. ఈ మేలో ఏయే మార్పులు ఉండనున్నాయో వివరంగా తెలుసుకుందాం.

1. ఏటీఎం విత్‌డ్రా ఛార్జీలు :
ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసేటప్పుడు ఇప్పుడు వినియోగదారులు ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని ఆర్బీఐ ప్రకటించింది. గతంలో ఈ ఛార్జీల ధర రూ.21గా ఉండేది. కానీ, ఇప్పుడు రూ.23కి పెంచనున్నారు. ఈ కొత్త ఛార్జీలు మే 1, 2025 నుంచి అమల్లోకి  రానున్నాయి.

మీడియా నివేదికల ప్రకారం.. ఈ మార్పులను సెంట్రల్ బ్యాంక్, ఆర్బీఐ, NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) రెండూ చేశాయి. ప్రస్తుతం, మెట్రో నగరంలో 3 సార్లు క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు. కానీ, లిమిట్ నుంచి ఎక్కువ నగదు విత్ డ్రా చేస్తే మీరు రూ. 21 ఛార్జీ చెల్లించాలి. మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమాటిక్‌గా కట్ అవుతుంది.

2. LPG గ్యాస్‌పై ప్రభావం :
ప్రతి నెలా దేశీయ గ్యాస్ నుంచి వాణిజ్య గ్యాస్ ధరలను గ్యాస్ ఏజెన్సీ సవరిస్తుంది. ఒకటో తేదీన ధర తగ్గడం లేదా పెరగడం కనిపిస్తుంది. ఏప్రిల్‌లోనే ప్రభుత్వం అన్ని సిలిండర్ల ధరలను దాదాపు 50 రూపాయలు పెంచేసింది.

3. FD, సేవింగ్స్ అకౌంట్లలో మార్పు :
ఈ ఏడాదిలో ఆర్బీఐ వరుసగా రెండుసార్లు రెపో రేటును తగ్గించింది. దీని ప్రభావంతో బ్యాంకులు FD అకౌంట్ నుంచి రుణాలపై వడ్డీలను తగ్గించాయి. అనేక ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు తమ వడ్డీ రేట్లను భారీగా తగ్గించాయి. రాబోయే కాలంలో అనేక బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది.

4. గ్రామీణ బ్యాంకుల్లో మార్పులు :
మే 1 నుంచి గ్రామీణ బ్యాంకులలో పెద్ద మార్పు ఉండవచ్చు. ప్రతి రాష్ట్రంలోని అన్ని గ్రామీణ బ్యాంకులను కలిపి ఒక పెద్ద బ్యాంకును ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఒక రాష్ట్రం, ఒక RRB స్కీమ్ కింద జరుగుతుంది. ఈ మార్పులు మొదటి 11 రాష్ట్రాలలో అమల్లోకి రానున్నాయి. ఇందులో పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఉన్నాయి.

Read Also : Reliance Jio Plan : జియో బంపర్ ఆఫర్.. సరసమైన ధరకే కొత్త రీఛార్జ్ ప్లాన్.. అన్‌లిమిటెడ్ కాలింగ్, హైస్పీడ్ డేటా.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి..!

5. రైల్వేలో కొత్త రూల్ :
మే 1 నుంచి రైల్వే టికెట్ బుకింగ్‌లో కొత్త రూల్ రాబోతోంది. ఇప్పుడు రైల్వే ప్రయాణీకులు వెయిటింగ్ టిక్కెట్లపై స్లీపర్, ఏసీ కోచ్‌లలో ప్రయాణించలేరు.