Reliance Jio Plan : జియో బంపర్ ఆఫర్.. సరసమైన ధరకే కొత్త రీఛార్జ్ ప్లాన్.. అన్‌లిమిటెడ్ కాలింగ్, హైస్పీడ్ డేటా.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి..!
Reliance Jio Plan : జియో రూ. 200 కన్నా తక్కువ ధరకే నెలకు అన్‌లిమిటెడ్ కాలింగ్ అందించే సరసమైన ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ లిమిటెడ్ డేటా కూడా అందిస్తోంది.

Reliance Jio Plan
Reliance Jio Plan : ప్రముఖ దేశీయ టెలికాం మార్కెట్‌లో అన్ని కంపెనీల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు భారీగా పెరిగాయి. దాంతో ఆయా నెట్‌వర్క్ సబ్‌స్క్రైబర్‌లు సరసమైన ప్లాన్ల కోసం చూస్తున్నారు. మీరు కూడా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్ తీసుకోవాలని అనుకుంటున్నారా?
మీరు రిలయన్స్ జియో యూజర్లు అయితే మీకో గుడ్ న్యూస్.. రిలయన్స్ జియో సరికొత్త రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. జియో నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచేందుకు చౌకైన ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ఈ బెస్ట్ ప్లాన్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రూ. 200 కన్నా తక్కువ ధరకే రీఛార్జ్ చేయడం ద్వారా జియో నంబర్‌ను ఒక నెల పాటు యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు. ఈ సరసమైన ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. రోజువారీ డేటా అందుబాటులో ఉండదు. కానీ, మొత్తం వ్యాలిడిటీకి లిమిటెడ్ డేటా పొందవచ్చు. మీరు సెకండరీ నంబర్ రీఛార్జ్ చేయాలనుకుంటే ఇదే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
జియో అత్యంత సరసమైన ప్లాన్ :
రిలయన్స్ జియో వినియోగదారులకు కంపెనీ రూ.189 సరసమైన ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకునే అవకాశాన్ని అందిస్తోంది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అన్ని నెట్‌వర్క్‌లలో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఆప్షన్ అందిస్తుంది. మొత్తం వ్యాలిడిటీ కాలానికి ఇందులో మొత్తం 2GB డేటా అందుబాటులో ఉంది.
వినియోగదారులు 28 రోజుల వ్యాలిడిటీతో 300 SMS పంపవచ్చు. అలాగే, ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే JioTV, JioAICloud యాక్సెస్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ 5G బెనిఫిట్స్ పొందలేరు. కానీ, డేటా అయిపోయినప్పుడు అదనపు డేటా కోసం బూస్టర్ ప్లాన్‌లను ఎంచుకోవచ్చు.