Tata Nano Electric Car : టాటా నానో ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోందోచ్.. సింగిల్ ఛార్జ్‌తో 250కి.మీ దూసుకెళ్లగలదు.. ధర ఎంత ఉండొచ్చుంటే?
Tata Nano Electric Car : టాటా నానో ఎలక్ట్రిక్ అవతార్ భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. లాంచ్‌కు ముందుగానే ఈ ఎలక్ట్రిక్ కారు గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కారు రాకపై కంపెనీ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Tata Nano Electric Car
Tata Nano Electric Car : మిడిల్ క్లాస్ డ్రీమ్ టాటా నానో ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది. దేశంలో టాటా మోటార్స్ కార్లకు ఫుల్ క్రేజ్ ఉంది. కానీ, కొన్నాళ్ల క్రితమే భారత్‌లో టాటా నానో కార్ల ఉత్పత్తి నిలిచిపోయింది. ఇప్పటికీ పాత నానో కార్లు రోడ్లపై కనిపిస్తున్నాయి. టాటా పాపులర్ నానో కారును ఎలక్ట్రిక్ వెర్షన్‌లో తిరిగి లాంచ్ చేసే అవకాశం ఉంది.
ఈ టాటా నానో ఈవీ కారు రాకపై సోషల్ మీడియాలో పుకార్లు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇదే నిజమైతే.. టాటా నానో ఎలక్ట్రిక్ అవతార్‌కు అద్భుతమైన స్పందన వస్తుందని భావిస్తున్నారు. నానో ఈవీ కారు లాంచ్‌కు సంబంధించి అధికారిక తేదీని వెల్లడించలేదు. సరసమైన ధరలో ఎలక్ట్రిక్ కారు ఎప్పుడు వస్తుందా? అని లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు.
టాటా నానో EV అద్భుతమైన ఫీచర్లు :
టాటా నానో ఎలక్ట్రిక్ 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేకు సపోర్టు ఇస్తుంది. బ్లూటూత్, ఇంటర్నెట్ కనెక్టివిటీతో 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుంది.
సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే.. ABSతో స్టీరింగ్, పవర్ విండోస్, యాంటీ-రోల్ బార్‌లు వంటి ఫీచర్లను పొందవచ్చు. అంతేకాకుండా, రిమోట్ ఫంక్షనాలిటీ, డెమో మోడ్ కూడా ఇందులో చేర్చే అవకాశం ఉంది. మల్టీ-డేటా డిస్‌ప్లేను కూడా అందించవచ్చు. కారు రేంజ్, ఇతర ముఖ్యమైన డేటాను చూపుతుంది. ఈ ముఖ్యమైన ఫీచర్లు ఈ నానో ఎలక్ట్రిక్ కారును అత్యంత అధునికంగా మార్చగలవు.
సింగిల్ ఛార్జ్ చేస్తే.. 250 కి.మీ వరకు రేంజ్ :
బ్యాటరీ, రేంజ్ పరంగా టాటా నానో ఎలక్ట్రిక్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. దాదాపు 250 కి.మీ దూరం ప్రయాణించగలదని భావిస్తున్నారు. పట్టణ ప్రయాణాలకు, చిన్న రోడ్డకు అనువైనది. ధర విషయానికి వస్తే.. టాటా నానో ఎలక్ట్రిక్ ధర రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. ఈ బడ్జెట్-ఫ్రెండ్లీ రేంజ్ కావడంతో సరసమైన ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తున్న కస్టమర్లలో ఈ కారు బాగా పాపులర్ అయ్యే అవకాశం ఉంది. ఈ ధరలో ఇప్పటికే ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది.
సోషల్ మీడియాలో నానో రాకపై పుకార్లు ::
టాటా నానో ఎలక్ట్రిక్ లాంచ్ గురించి టాటా మోటార్స్ ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సోషల్ మీడియాలో పుకార్ల ఆధారంగా ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. రాబోయే రోజుల్లో టాటా నానో ఎలక్ట్రిక్ లాంచ్ అయితే, భారతీయ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో భారీ మార్పును తీసుకురానుంది.
కానీ, ప్రస్తుతానికి అందరూ టాటా నానో కారు గురించి నుంచి అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ పుకార్లు నిజమైతే.. నానో కారు ఎలక్ట్రిక్ అవతార్‌లో తిరిగి భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.