Bank Holidays May 2025 : బిగ్ అలర్ట్.. మేలో బ్యాంకు పని ఉందా? ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయంటే? ఫుల్ లిస్టు మీకోసం..!

Bank Holidays May 2025 : మే 2025లో దేశవ్యాప్తంగా బ్యాంకులకు 6 సెలవులు ఉంటాయి. ఏయే రోజుల్లో బ్యాంకులు పనిచేయవో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Bank Holidays May 2025 : బిగ్ అలర్ట్.. మేలో బ్యాంకు పని ఉందా? ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయంటే? ఫుల్ లిస్టు మీకోసం..!

Bank Holidays May 2025

Updated On : April 30, 2025 / 11:16 PM IST

Bank Holidays May 2025 : బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్.. వచ్చే మేలో బ్యాంకు పని ఉందా? అయితే, ఇది మీకోసమే.. మే నెలలో కొన్ని రోజుల పాటు బ్యాంకులకు హాలిడేస్ ఉన్నాయి. ఆర్బీఐ
2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాల వారీగా సెలవులను ప్రకటించింది.

అధికారిక హాలిడేస్ క్యాలెండర్ ప్రకారం.. మే 2025లో మొత్తం 6 బ్యాంకు హాలిడేస్‌గా నిర్ణయించింది. దేశంలో బ్యాంకు సెలవులు రాష్ట్రం నుంచి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. జాతీయ, ప్రాంతీయ, మతపరమైన పండుగల ఆధారంగా బ్యాంకులకు సెలవులు ఉంటాయి.

Read Also : May 1st New Rules : బిగ్ అలర్ట్.. మే 1 నుంచి రానున్న కొత్త మార్పులివే.. ఏటీఎం ఛార్జీల నుంచి రైల్వే టికెట్ల వరకు.. ఫుల్ డిటెయిల్స్..!

ఆరు సెలవు దినాలతో పాటు, 2025 మే నెలలో ఆదివారాలు, రెండో శనివారం, నాల్గవ శనివారాల్లో బ్యాంకులు పనిచేయవు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రాల వారీగా బ్యాంకు సెలవుల ఫుల్ లిస్టు మీకోసం అందిస్తున్నాం. కొన్ని ప్రాంతాలలో మే 2025లో బుద్ధ పూర్ణిమ, కార్మిక దినోత్సవం, మహారాణా ప్రతాప్ జయంతి సందర్భాల్లో బ్యాంకులు మూతపడతాయి.

మే 2025లో బ్యాంకు సెలవులు.. రాష్ట్రాల వారీగా హాలిడేస్ క్యాలెండర్ వివరాలివే

మే 1 (గురువారం) : మే డే (కార్మిక దినోత్సవం)
బేలాపూర్, బెంగళూరు, చెన్నై, గువహతి, హైదరాబాద్ (ఆంధ్రప్రదేశ్), హైదరాబాద్ (తెలంగాణ), ఇంఫాల్, కొచ్చి, కోల్‌కతా, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, పాట్నా, తిరువనంతపురంలలో బ్యాంకులు పనిచేయవు.

మే 9 (శుక్రవారం) : రవీంద్రనాథ్ ఠాగూర్ పుట్టినరోజు
రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకుని 2025 మే 9, శుక్రవారం కోల్‌కతాలోని బ్యాంకులు మూతపడతాయి.

మే 12 (సోమవారం) : బుద్ధ పూర్ణిమ
అగర్తల, ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, డెహ్రాడూన్, ఇటానగర్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, రాంచీ, సిమ్లా, శ్రీనగర్‌లలో బ్యాంకులు పనిచేయవు.

మే 16 (శుక్రవారం) : రాష్ట్ర దినోత్సవం
రాష్ట్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మే 16, శుక్రవారం సిక్కిం అంతటా బ్యాంకులు మూతపడతాయి.

మే 26 (సోమవారం) : కాజీ నజ్రుల్ ఇస్లాం పుట్టినరోజు
కాజీ నజ్రుల్ ఇస్లాం పుట్టినరోజు సందర్భంగా త్రిపురలోని బ్యాంకులు మూతపడతాయి.

మే 29 (గురువారం) : మహారాణా ప్రతాప్ జయంతి
మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్‌లో బ్యాంకులు మూతపడతాయి.

బ్యాంకు సెలవుల్లో అందుబాటులో సేవలు :
బ్యాంకు సెలవు దినాల్లో కూడా బ్యాంకింగ్ సేవలను పొందే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలను వినియోగదారులు పొందవచ్చు. ఆర్థిక లావాదేవీల కోసం ఈ సేవలను ఉపయోగించవచ్చు.

Read Also : Tata Nano Electric Car : టాటా నానో ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోందోచ్.. సింగిల్ ఛార్జ్‌తో 250కి.మీ దూసుకెళ్లగలదు.. ధర ఎంత ఉండొచ్చుంటే?

NEFT/RTGS ట్రాన్స్‌ఫర్ ఫారమ్‌లు, డిమాండ్ డ్రాఫ్ట్ రిక్వెస్ట్ ఫారమ్‌, చెక్‌బుక్ ఫారమ్‌లను ఉపయోగించి ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ రిక్వెస్ట్ చేయవచ్చు. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఏటీఎం కార్డులను కార్డ్ సేవల ద్వారా పొందవచ్చు. అకౌంట్ నిర్వహణ ఫారమ్‌లు, లాకర్ కోసం దరఖాస్తు చేసుకోవడం వంటి సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.