Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు చిన్నారులుసహా ఏడుగురు సజీవదహనం

ముంబయిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. చెంబూరులోని సిద్దార్ధ నగర్ కాలనీలో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో ముగ్గురు చిన్నారులతోసహా ఏడుగురు సజీవదహనం అయ్యారు.

Fire Accident In Mumbai

Fire Accident In Mumbai : ముంబయిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. చెంబూరులోని సిద్దార్ధ నగర్ కాలనీలో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో ముగ్గురు చిన్నారులతోసహా ఏడుగురు సజీవదహనం అయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారు జామున 5.20 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది.

Also Read : Darshan : జైలులో వెన్ను నొప్పితో హీరో బాధలు.. ఆత్మ వెంటాడుతుంది జైలు మార్చండి అంటూ రిక్వెస్ట్..?

జీప్లస్2 భవనంలో ఈ మంటలు చెలరేగాయి. ఇంటి కింద కిరాణం షాపు ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా తొలుత మంటలు కిరాణం దుకాణంలో చెలరేగాయి.. ఆ తరువాత వేగంగా ఇళ్లంతా వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు చుట్టుపక్కలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే, మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం సంతాపాన్ని ప్రకటించింది.

ఈ ఘటనలో గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించగా.. వారందరూ చనిపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మృతులను పారిస్ గుప్తా (7), మంజు ప్రేమ్ గుప్తా (30), అనితా గుప్తా (39), ప్రేమ్ గుప్తా (30), నరేంద్ర గుప్తా (10), విధి చెదిరామ్ గుప్తా(15)గా గుర్తించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.