అస్సాంలోని దిబుర్‌ఘడ్ యూనివర్సిటీలో మ్యాథ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న వ్యక్తి వీడియో రికార్డు చేసి పోర్నోగ్రఫీ సైట్లలో అప్‌లోడ్ చేశాడు. నిందితుడ్ని ధ్రువజిత్ చౌదరిగా పోలీసులు గుర్తించారు. ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ అతణ్ని సస్పెండ్ చేస్తూ.. నిర్ణయం తీసుకుంది. దిబ్రుఘడ్ యూనివర్సిటీ టీచర్స్ సర్వీస్ కండిషన్స్ ఆర్డినెన్స్, 1974ప్రకారం సస్పెండ్ అయ్యాడు.
‘గుర్తు తెలియని మహిళ వీడియో రికార్డు చేసి ఆ తర్వాత అడల్ట్ సైట్ లో అప్ లోడ్ చేశాడు. దీనిని క్రిమినల్ అఫెన్స్ కింద, తప్పుడు ప్రవర్తన కింద నమోదు చేశారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ తప్పులకు పాల్పడ్డాడు. అతణ్ని పట్టుకోవడానికి వెళ్లినప్పుడు పోలీసులకు చెప్పిన సమాధానానికి అంతా చికాకుపడుతున్నారు.
ప్రస్తుత కాలంలో అంతా అడల్ట్ సైట్లలో కనిపిస్తుందని.. ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో ఉంటుందని ఇలా చేయడం తప్పేమీ కాదని చెప్పుకొచ్చాడట.