Maulana Abul Kalam Azad
NCERT: పాఠ్యపుస్తకాల్లో అనేక మార్పులు జరుగుతుంటాయి. ఉన్నవాటిని తీసేయడమో, కొత్త వాటిని చేర్చడమో లాంటివి జరుగుతున్నాయి. అయితే కొన్నిసార్లు ఇవి వివాదాస్పదమవుతుంటాయి. కారణం.. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తప్పుడు ఉద్దేశాలతో ఇలాంటి మార్పులు చేస్తున్నాయనే విమర్శలు వస్తుండడం. ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పాఠ్యాంశాల మార్పుపై తరుచూ ఇలాంటి వివాదాలే తలెత్తుతున్నాయి. ఇక తాజాగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) చేస్తున్న మార్పులు కూడా చర్చనీయాంశమవుతున్నాయి.
Karnataka Polls: సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా భగ్గుమన్న మంటలు
ఇంతకు ముందు గోద్రా అల్లర్లు, గాంధీ హత్య వంటి పాఠ్యాంశాలను తొలగించింది ఎన్‌సీఈఆర్‌టీ. ఇవి దేశంలో వివాదాన్ని రేకెత్తించాయి. అయినప్పటికీ వెనుకాడక తాజాగా మరో నిర్ణయం తీసుకుని, మరో వివాదానికి తెరలేపింది ఎన్‌సీఈఆర్‌టీ. 11వ తరగతి పాఠ్యపుస్తకం నుంచి మౌలానా అబుల్ కలాం ఆజాద్ (Maulana Abul Kalam Azad) పాఠ్యాంశాన్ని తొలగించారు. 11వ తరగతి పొలిటికల్ సైన్స్ పాఠ్యపుస్తకాల్లో నుంచి స్వతంత్ర భారతదేశపు మొదటి విద్యా మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ పాఠ్యాంశాన్ని తొలగించడంపై వివాదం రాజుకుంది. మహాత్మా గాంధీ హత్య, స్వాతంత్ర్యం తర్వాత గాంధీ ఏమి చేశారు అనే సూచనలను తొలగించిన అనంతరం ఇది పెద్ద వివాదంగా మారింది.
Uttar Pradesh: యూపీ ఎన్కౌంటర్పై అనుమానాలు, విమర్శలు.. ఇంతకీ మాయావతి, అఖిలేష్ ఏమన్నారంటే?
అయితే హేతుబద్ధీకరణలో భాగంగా వీటిని తొలగిస్తున్నట్లు ఎన్‌సీఈఆర్‌టీ ప్రకటించినప్పటికీ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రభావం వల్లే ఇలాంటి నిర్ణయాలు వస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇక మౌలానా అబుల్ కలాం గురించి చెప్పుకుంటే.. 1946లో రాజ్యాంగాన్ని రూపొందించడానికి భారత కొత్త రాజ్యాంగ పరిషత్ ఎన్నికలలో కాంగ్రెస్‌కు నాయకత్వం వహించినప్పుడు ఆజాద్ కీలక పాత్ర పోషించారు. ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడిగా బ్రిటిష్ క్యాబినెట్ మిషన్‌తో చర్చలు జరపడానికి ఒక ప్రతినిధి బృందానికి కూడా నాయకత్వం వహించారు. ఇక ఇదే కాకుండా సిగ్గు సంఘాల నుంచి కూడా ఎన్‌సీఈఆర్‌టీ మీద విమర్శలు వస్తున్నాయి. 12వ తరగతి పుస్తకంలో ఆనంద్‌పూర్ సాహిబ్ తీర్మానంపై చారిత్రక వివరాలను ఎన్సీఆర్టీ తప్పుగా ప్రచురించిందని సిక్కు సంఘం ఆరోపిస్తోంది.