CM Sangma: మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా సీఎం పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ ఫగు చౌహాన్‌ను కలిసి శుక్రవారం తన రాజీనామా లేఖ సమర్పించారు. అలాగే కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిపాదన చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ఎన్పీపీ అత్యధిక స్థానాలు సాధించింది.
Andhra Pradesh: రాజధాని కేసుల ముందస్తు విచారణ కోరిన ఏపీ.. నిరాకరించిన సుప్రీం కోర్టు
59 అసెంబ్లీ స్థానాలకుగాను ఎన్పీపీ 26 స్థానాల్లో గెలిచి, అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా నిలిచింది. అయితే, అధికారంలోకి రావాలంటే మరో నాలుగు స్థానాలు (30 సీట్లు) అవసరం. దీంతో బీజేపీ మద్దతుతో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సంగ్మా ప్రయత్నిస్తున్నారు. అయితే, బీజేపీ ఇక్కడ మూడు స్థానాలు మాత్రమే గెలుచుకుంది. దీంతో ఇతరుల మద్దతు కూడా అవసరం. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా వంటి నేతలు మేఘాలయలో ప్రచారం చేసినా బీజేపీ మూడు సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. ప్రభుత్వ ఏర్పాటు గురించి సంగ్మా మీడియాతో మాట్లాడారు.
Karnataka: ఎన్నికలకు ముందు బీజేపీకి ఎదురుదెబ్బ.. లంచం తీసుకుంటూ దొరికిపోయిన బీజేపీ ఎమ్మెల్యే కొడుకు
‘‘ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ మాకు మద్దతిస్తోంది. గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించాం. బీజేపీ, ఇతర పార్టీలు మాకు మద్దతు ఇస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలం మాకుంది. అన్ని పార్టీలు మాకు మద్దతిస్తున్నాయి. ప్రదాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. వాళ్ల అంగీకారం కోసం ఎదురు చూస్తున్నాం’’ అని సంగ్మా వ్యాఖ్యానించారు.
మరోవైపు ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాత రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తలెత్తిన హింసపై కూడా ఆయన స్పందించారు. ‘‘ఇలాంటి ఘటనలు సరికాదు. కొన్ని ప్రాంతాల్లో హింస జరిగింది. అయితే, ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. నేను ప్రజల్ని, రాజకీయ పార్టీల్ని కోరుతున్నా.. ఇప్పటికే ఎన్నికలు పూర్తయ్యాయి. హింస సరికాదు. ఎలాంటి హింసకు పాల్పడవద్దు’’ అని సంగ్మా అన్నారు.