Karnataka: ఎన్నికలకు ముందు బీజేపీకి ఎదురుదెబ్బ.. లంచం తీసుకుంటూ దొరికిపోయిన బీజేపీ ఎమ్మెల్యే కొడుకు

బీజేపీ ఎమ్మెల్యే మాదల్ విరూపాక్షప్ప కొడుకు ప్రశాంత్ మాదల్. అతడు రాష్ట్ర సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ సంస్థ ఛైర్మన్‌గా ఉన్నాడు. ప్రశాంత్ లంచాలు తీసుకుంటున్నట్లుగా అతడిపై ఒక వ్యక్తి కర్ణాటక లోకాయుక్తకు ఫిర్యాదు చేశాడు. అవినీతి కేసులను విచారించేందుకు కర్ణాటకలో ఏర్పాటైన సంస్థ ‘లోకాయుక్త’.

Karnataka: ఎన్నికలకు ముందు బీజేపీకి ఎదురుదెబ్బ.. లంచం తీసుకుంటూ దొరికిపోయిన బీజేపీ ఎమ్మెల్యే కొడుకు

Karnataka: రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కొడుకు రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. బీజేపీ ఎమ్మెల్యే మాదల్ విరూపాక్షప్ప కొడుకు ప్రశాంత్ మాదల్. అతడు రాష్ట్ర సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ సంస్థ ఛైర్మన్‌గా ఉన్నాడు.

Andhra Pradesh: రాజధాని కేసుల ముందస్తు విచారణ కోరిన ఏపీ.. నిరాకరించిన సుప్రీం కోర్టు

ప్రశాంత్ లంచాలు తీసుకుంటున్నట్లుగా అతడిపై ఒక వ్యక్తి కర్ణాటక లోకాయుక్తకు ఫిర్యాదు చేశాడు. అవినీతి కేసులను విచారించేందుకు కర్ణాటకలో ఏర్పాటైన సంస్థ ‘లోకాయుక్త’. ప్రశాంత్‌పై వచ్చిన ఫిర్యాదు మేరకు లోకాయుక్త స్పందించింది. అతడిని ట్రాప్ చేసి పట్టుకుంది. బెంగళూరులోని తన ప్రైవేటు ఆఫీసులో ప్రశాంత్ రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ ఉండగా లోకాయుక్త రైడ్ చేసి పట్టుకుంది. దీంతో డబ్బుతోసహా ప్రశాంత్ మాదల్ దొరికిపోయాడు. ఈ ఆఫీసులో లోకాయుక్త సోదాలు నిర్వహించి మొత్తం రూ.1.7 కోట్లు స్వాధీనం చేసుకుంది. ప్రశాంత్ మాదల్ తన తండ్రి, ఎమ్మెల్యే విరూపాక్షప్ప తరఫున లంచం తీసుకుంటూ ఉండొచ్చని లోకాయుక్త అధికారులు తెలిపారు.

Manchu Manoj Marriage : మనోజ్ పెళ్ళి దగ్గరుండి చేస్తున్న మంచు లక్ష్మి.. సోషల్ మీడియాలో మెహందీ వేడుకలు, డెకరేషన్ ఫోటోలు పోస్ట్..

ప్రస్తుతం ఈ కోణంలో కూడా విచారణ జరుపుతున్నామని అధికారులు చెప్పారు. ఈ అంశంపై స్పందించేందుకు ఎమ్మెల్యే విరూపాక్షప్ప నిరాకరించారు. తన కొడుకు లోకాయుక్త అధికారుల ఆధీనంలో ఉండగా, ఈ అంశంపై మాట్లాడటం సరికాదని వ్యాఖ్యానించారు. బీజేపీ ఎమ్మెల్యే కొడుకు లంచం తీసుకుంటూ దొరికిపోవడం ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. గతంలో అవినీతిపై విచారణ జరిపేందుకు ఏసీబీ ఉండేది. అయితే, దీన్ని కర్ణాటక ప్రభుత్వం తీసేసి, దాని స్థానంలో లోకాయుక్తను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని అవినీతి కేసులు, లంచం వంటి అంశాలపై ఈ సంస్థే దర్యాప్తు జరుపుతుంది.