Andhra Pradesh: రాజధాని కేసుల ముందస్తు విచారణ కోరిన ఏపీ.. నిరాకరించిన సుప్రీం కోర్టు

అమరావతి కేసులకు సంబంధించిన విచారణ మార్చి 28న సుప్రీం కోర్టులో జరపాల్సి ఉంది. అయితే, అంతకంటే ముందుగానే కేసు విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు కోరారు. ఈ విజ్ణప్తిని జస్టిస్ కేఎం జోసెఫ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం తోసిపుచ్చింది.

Andhra Pradesh: రాజధాని కేసుల ముందస్తు విచారణ కోరిన ఏపీ.. నిరాకరించిన సుప్రీం కోర్టు

Andhra Pradesh: ఏపీ రాజధాని (అమరావతి)కి సంబంధించిన కేసులను ముందుగానే విచారించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేసిన వినతిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అమరావతి కేసును త్వరగా విచారించేందుకు కోర్టు నిరాకరించింది. అమరావతి కేసులకు సంబంధించిన విచారణ మార్చి 28న సుప్రీం కోర్టులో జరపాల్సి ఉంది.

Venkatesh : ఫస్ట్ టైం నెగిటివ్ రోల్ చేశాను.. రానాకి ఎదురుగా నటించాలంటే కష్టమే..

అయితే, అంతకంటే ముందుగానే కేసు విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు కోరారు. ఈ విజ్ణప్తిని జస్టిస్ కేఎం జోసెఫ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ కేసులో అనేక రాజ్యాంగ పరమైన అంశాలు ఇమిడి ఉన్నాయని, అందువల్ల ఈ నెల 28నే విచారిస్తామని కోర్టు స్పష్టం చేసింది. అలాగే కేసు విచారణ 28న మాత్రమే కాకుండా ఆ తర్వాత 29, 30 తేదీల్లో కూడా విచారించాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. అయితే, నోటీసులు ఇచ్చిన కేసులపై బుధ, గురువారాల్లో విచారణ జరపరాదని సీజేఐ ఆదేశాలున్నాయని జస్టిస్ కేఎం జోసెఫ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం గుర్తు చేసింది.

Manchu Manoj Marriage : మనోజ్ పెళ్ళి దగ్గరుండి చేస్తున్న మంచు లక్ష్మి.. సోషల్ మీడియాలో మెహందీ వేడుకలు, డెకరేషన్ ఫోటోలు పోస్ట్..

దీంతో ఆ తర్వాత రెండు రోజుల్లో విచారణ చేపట్టలేమని తెలిపింది. అలాగైతే ఈ అంశాన్ని సీజేఐ ముందు ప్రస్తావించేందుకు అనుమతివ్వాలని ఏపీ న్యాయవాదులు కోరారు. దీనికి కూడా కోర్టు నిరాకరించింది. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని దాఖలైన అనేక పిటిషన్లు ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణలో ఉన్నాయి. అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ, ఆరు నెలల్లోగా అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. మరోవైపు మస్తాన్ వలీ అనే వ్యక్తి కూడా రాజధాని అంశంపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

శివ రామ కృష్ణన్ కమిటీ నివేదిక ప్రకారం రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని కూడా కలిపి విచారించాలని ఆయన కోరారు. అన్నింటిపైనా సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.