అర్ధరాత్రి హోం శాఖ ఆర్డర్.. నగర సమీప ప్రాంతాల్లో షాపులు తెరిచేందుకు అనుమతి

కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో సడలింపు ఇస్తోంది. కరోనా హాట్ స్పాట్, కంటైన్ మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో నిబంధనలను సడలింపు చేసింది.

Shops

కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో సడలింపు ఇస్తోంది. కరోనా హాట్ స్పాట్, కంటైన్ మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో నిబంధనలను సడలింపు చేసింది. పొరుగు ప్రాంతాల్లో షాపులను తెరిచేందుకు అనుమతినిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాత్రికి రాత్రే ఆర్డర్ జారీ చేసింది. శుక్రవారం అర్ధరాత్రి మునిసిపల్ ప్రాంతాలలో నివాస సముదాయాలలో ఉన్న సమీప ప్రాంతాలతో సహా పొరుగు ప్రాంతాల్లో షాపులను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా షాపుల్లో 50 శాతం వర్కర్లకు మాత్రమే సడలింపుతో అనుమతి ఇచ్చింది. భారతదేశంలో ఇప్పటివరకు 23,000 మందికి పైగా కరోనా సోకింది. 723 మంది ప్రాణాలు కోల్పోయారు.

మున్సిపాలిటీ ప్రాంతాలలో ఉన్న మార్కెట్ ప్రదేశాలు, మల్టీ-బ్రాండ్  సింగిల్ బ్రాండ్ మాల్స్ దుకాణాలు మే 3 వరకు మూసివేయాల్సిందేనని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) విడుదల చేసిన ఉత్తర్వులో పేర్కొంది. కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా సంతకంతో అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. హాట్‌స్పాట్‌లు లేదా కంటైనర్ జోన్‌ల పరిధిలోకి వచ్చే ప్రాంతాలకు ఈ సడలింపు వర్తించదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

పొరుగు రాష్ట్రాల దుకాణాలు , స్వతంత్ర దుకాణాలు, నివాస సముదాయాలలోని దుకాణాలు, మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల పరిమితుల్లో, సంబంధిత రాష్ట్రం UT షాపులు, Establishment Act క్రింద నమోదు చేసిన అన్ని షాపులను లాక్ డౌన్ సమయంలో తెరిచేందుకు అనుమతినిస్తున్నట్టుగా పేర్కొంది. మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల వెలుపల ఉన్న రిజిస్టర్డ్ మార్కెట్లలోని షాపుల విషయానికొస్తే.. సామాజిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడంతోపాటు, 50 శాతం మంది మాత్రమే కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి అనుమతిస్తుంది.

శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వు ఏప్రిల్ 15న కేంద్రం జారీ చేసిన మునుపటి ఉత్తర్వులను సవరించింది. 21 రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ సమయాన్ని మే 3 వరకు అదనంగా 19 రోజులు పొడిగించింది. తాజా ఉత్తర్వు ప్రకారం.. తప్పనిసరిగా 50 శాతం మంది వర్కర్లు మాస్క్‌లు ధరించాలి. సామాజిక దూరాన్ని అనుసరించడం ద్వారా షాపుల్లో పనిచేయడానికి కఠినమైన మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. దుకాణాల్లో చిన్న స్థాయిలో అనుమతించటం వల్ల మార్చి 24 నుండి లాక్ డౌన్‌లో ఉన్న ప్రజలకు కాస్తా ఉపశమనాన్ని సూచిస్తుందని MHA ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. సడలించిన ప్రాంతాల్లో సింగిల్ , మల్టీ బ్రాండ్స్ షాపులు తెరవడానికి అనుమతి లేదు.