ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన మిగ్ 21 శుక్రవారం రాజస్థాన్‌లోని బికనీర్ దగ్గర్లో క్రాష్‌కు గురైంది. గాల్లో ప్రయాణిస్తుండగానే జరిగిన ప్రమాదం నుంచి పైలట్ సేఫ్ గా కిందకి దిగాడు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన మిగ్ 21 యుద్ధ విమానం క్రాష్ అయ్యింది. మార్చి 8వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం రాజస్థాన్ రాష్ట్రం బికనీర్ దగ్గర కూలిపోయింది. గాల్లో ప్రయాణిస్తుండగానే జరిగిన ప్రమాదం నుంచి పైలట్ సేఫ్ గా కిందకి దిగాడు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.
ఇంజిన్‌లో సాంకేతిక కారణాల వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. మరో వైపు ఏదైనా పక్షి తగిలి ప్రమాదం జరిగే సూచనలు ఉన్నాయని చెబుతున్నారు. ఫిబ్రవరి 27న భారత్‌కు చెందిన పైలెట్ అభినందన్ యుద్ధ విమానం కూడా ప్రమాదానికి గురై క్రాష్ అయింది. దీంతో అభినందన్ పాక్ బోర్డర్‌లో దిగాల్సి వచ్చింది.
నిపుణుల అంచనా ప్రకారం.. మిగ్ 21 అనేది పాకిస్తాన్ ఎఫ్ 16కు కౌంటర్ ఇచ్చేందుకు ఉపయోగపడేదని తెలిపారు. ఎందుకంటే ఇది డెల్టా వింగ్ తో మిరాజ్ 2000, ఎల్సీఏ తేజాస్ లను పోలి ఉంటుంది. ఎంతో సమర్థవంతంగా టార్గెట్ చేధించగల మిగ్-21 యుద్ధ విమానాలు ఇలా వరసగా క్రాష్ అవ్వటం ఆందోళన కలిగిస్తోంది.