Minister Aditya Thackeray : రెబల్స్‌కు సీఆర్‌పీఎఫ్‌ సెక్యూరిటీపై మంత్రి ఆదిత్యఠాక్రే సీరియస్‌

దమ్ముంటే రెబల్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలని సవాల్‌ విసిరారు. రెబల్స్‌కు వ్యతిరేకంగా మహారాష్ట్ర వ్యాప్తంగా శివ సైనికుల ధర్నాలు కొనసాగుతున్నాయి.

Minister Aditya Thackeray : రెబల్స్‌కు సీఆర్‌పీఎఫ్‌ సెక్యూరిటీపై మంత్రి ఆదిత్యఠాక్రే సీరియస్‌

Aditya Thackeray

Updated On : June 26, 2022 / 4:57 PM IST

Minister Aditya Thackeray : కేంద్ర ప్రభుత్వంపై మహారాష్ట్ర మంత్రి ఆదిత్యఠాక్రే మండిపడ్డారు. శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలకు సీఆర్పీఎఫ్‌ సెక్యూరిటీపై ఇవ్వడంపై విమర్శలు కురిపించారు. గౌహతి పారిపోయిన వారికి సెక్యూరిటీ ఇచ్చారంటూ ఫైరయ్యారు. ఆ సెక్యూరిటీని కశ్మీరీ పండిట్లకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పార్టీ గుర్తు, పార్టీపై ప్రేమను రెబల్స్‌ కొల్లగొట్టలేరని ఆదిత్యఠాక్రే తేల్చి చెప్పారు. దమ్ముంటే రెబల్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలని సవాల్‌ విసిరారు. రెబల్స్‌కు వ్యతిరేకంగా మహారాష్ట్ర వ్యాప్తంగా శివ సైనికుల ధర్నాలు కొనసాగుతున్నాయి.

మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు సత్యానికి, అసత్యానికి మధ్య జరుగుతున్న యుద్ధమని మంత్రి ఆదిత్యా థాక్రే అభిప్రాయపడ్డారు. శనివారం జరిగిన శివసేన జాతీయ కార్యవర్గ సమావేశం అనంతరం ఆదిత్యా థాక్రే మీడియాతో మాట్లాడూతూ ‘‘ఇది సత్యానికి, అసత్యానికి మధ్య జరుగుతున్న పోరాటం. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నమ్మక ద్రోహాన్ని ఎప్పటికీ మర్చిపోలేం. ఈ పోరాటంలో శివసేనే గెలుస్తుంది’’ అని వ్యాఖ్యానించారు.

Maharashtra Political Crisis: షిండేకు షాక్.. ఉద్ధవ్‌తో టచ్‌లో 20మంది రెబల్స్?

తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సమావేశంలో తీర్మానం చేశారు. ఏక్‌నాథ్ షిండేతోపాటు, తిరుగు బాటు చేసిన ఎమ్మెల్యేలు అందరిపై అనర్హత వేటు వేయాలని నిర్ణయించారు. దీనిపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నారు. ఉద్ధవ్ తనయుడు ఆదిత్య రాష్ట్రంలో మంత్రిగా కొనసాగుతుంటే, ఏక్‌నాథ్ షిండే కొడుకు శివసేన తరఫున ఎంపీగా గెలిచాడు.