Income Tax Portal: ఇన్ఫోసిస్ CEO సలీల్ పరేఖ్‌కి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటీసులు.. ఎందుకంటే?

దేశంలోని అతిపెద్ద టెక్నాలజీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ MD మరియు CEO అయిన సలీల్ పరేఖ్‌కు భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ సమన్లు ​​జారీ చేసింది.

Paresh

Income Tax Portal: దేశంలోని అతిపెద్ద టెక్నాలజీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ MD మరియు CEO అయిన సలీల్ పరేఖ్‌కు భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ సమన్లు ​​జారీ చేసింది. కొత్త E-ఫైలింగ్ పోర్టల్ ప్రారంభమై రెండున్నర నెలలైనా అందులో వస్తున్న అవాంతరాలను ఎందుకు పరిష్కరించట్లేదని వివరించడానికి ఇన్ఫోసిస్ CEO సలీల్ పరేఖ్ 23 ఆగస్టు 2021న తమ కార్యాలయానికి రావలసిందిగా ఆర్థిక మంత్రిత్వశాఖ నోటీసులు ఇచ్చింది. ఆదాయపు పన్ను శాఖ రిటర్న్స్ దాఖలు చేయడానికి ఐటీ శాఖ కొత్తగా అందుబాటులోకి తీసుకుని వచ్చిన ఈ-ఫైలింగ్ పోర్టల్ ఇంకా అందుబాటులోకి రాలేదు.

ఈ-ఫైలింగ్ కొత్త పోర్టల్‌లో సమస్యలు:
ఆదాయపు పన్నుశాఖ ప్రతిష్టాత్మకంగా రంగంలోకి తీసుకుని వచ్చిన ఈ-ఫైలింగ్‌లో అనేక ఇబ్బందులు ఉన్నట్లుగా ఆ శాఖకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఆదాయపు పన్ను రిటర్న్స్(ITR) దాఖలు చేసే వ్యక్తులు దీని కారణంగా చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. పన్ను చెల్లింపుదారుల సమస్యను అర్థం చేసుకున్నామని , ఆదాయపు పన్ను శాఖ ఈ ఫైలింగ్ పోర్టల్ పనిచేయకపోవడం వల్ల వారు సమస్యలను ఎదుర్కొంటున్నారని ఢిల్లీ హైకోర్టుకు వినియోగదారులు కూడా ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలోనే ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారు. ఈ-ఫైలింగ్ పోర్టల్ త్వరలో పరిష్కరించబడుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆదాయపు పన్ను శాఖ కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్‌కు సంబంధించి ఇప్పటివరకు 700 ఈ-మెయిల్‌లు స్వీకరించబడ్డాయని కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇందులో 2వేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయి. ఆదాయపు పన్ను శాఖ కొత్త ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లో, 90కి పైగా వివిధ రకాల సమస్యలు తెరపైకి వచ్చాయి. ప్రభుత్వానికి పంపిన ఈ ఫిర్యాదుల్లో పన్ను నిపుణులు, ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) మరియు పన్ను చెల్లింపుదారులు ఉన్నారు.

ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్(IT రిటర్న్ పోర్టల్)కు సంబంధించిన ప్రశ్నకు సమాధానంగా లోక్‌సభలో ప్రభుత్వం, “కొత్త ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్ (IT రిటర్న్ పోర్టల్) తయారు చేస్తున్న ఇన్ఫోసిస్, పోర్టల్ పనితీరులో సాంకేతిక సమస్యను ఎదుర్కొంటుంది.” ఆదాయపు పన్ను శాఖ (IT రిటర్న్ పోర్టల్) కొత్త వెబ్‌సైట్‌లో ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలను తొలగించడానికి నిరంతర చర్యలు తీసుకుంటున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపిందని చెప్పారు. ఈ క్రమంలోనే ఇన్ఫోసిస్ సీఈఓకు ఆర్థిక శాఖ నుంచి పిలుపు వచ్చింది.