rocket grenade attack : పంజాబ్ లో పోలీస్ స్టేషన్ పై రాకెట్ గ్రనేడ్ తో దుండగులు దాడి
పంజాబ్ లో దుండగులు ఏకంగా పోలీస్ స్టేషన్ పై రాకెట్ గ్రనేడ్ తో దాడికి పాల్పడ్డారు. శనివారం తర్న్ తరన్ లో తెల్లవారుజామున 1 గంటల సమయంలో పోలీస్ స్టేషన్ బయటి ప్లిలర్ కు రాకెట్ గ్రనేడ్ తగిలింది.

rocket grenade attack
rocket grenade attack : పంజాబ్ లో దుండగులు ఏకంగా పోలీస్ స్టేషన్ పై రాకెట్ గ్రనేడ్ తో దాడికి పాల్పడ్డారు. శనివారం తర్న్ తరన్ లో తెల్లవారుజామున 1 గంటల సమయంలో పోలీస్ స్టేషన్ బయటి ప్లిలర్ కు రాకెట్ గ్రనేడ్ తగిలింది. అయితే పిల్లర్ కు తగిలిన తర్వాత అది ఎగరడంతో భారీ ప్రమాదం తప్పింది. పోలీస్ స్టేషన్ స్వల్పంగానే ధ్వంసమైందని, ఎవరికి ఎలాంటి ప్రమాదం జరుగలేదని అధికారులు పేర్కొన్నారు.
Grenade Attack : పుల్వామాలో భద్రతా దళాలపై గ్రనేడ్ దాడి
అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తర్న్ తరన్ పోలీస్ స్టేషన్ ను పంజాబ్ డీజీపీ, ఫోర్సెనిక్ నిపుణులు పరిశీలించనున్నారు. రాకెట్ చాలా శక్తివంతమైన అయితే పిల్లర్ ను ఢీకొట్టిన తర్వాత మళ్లీ ఎగరడంతో స్టేషన్ ధ్వంసం చేయలేకపోయిందని నిపుణులు పేర్కొన్నారు.