Miss Universe 2021 : భారతీయురాలికి మిస్ యూనివర్స్ టైటిల్

దాదాపు 21 ఏళ్ల తర్వాత..భారత్ కు మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. భారత్ కు మూడో మిస్ యూనివర్స్ కిరీటం అందించారు హర్నాజ్ కౌర్.

Harnaaz Sandhu : మిస్ యూనివర్స్ కిరిటాన్ని హర్నాజ్ కౌర్ సంధు గెలుచుకున్నారు. టాప్ 5లో నిలిచిన ఈమె…అందర్నీ దాటుకుంటూ..కిరీటాన్ని గెలుచుకున్నారు. దాదాపు 21 ఏళ్ల తర్వాత..భారత్ కు మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. భారత్ కు మూడో మిస్ యూనివర్స్ కిరీటం అందించారు హర్నాజ్ కౌర్. 1994లో సుస్మితా సేన్, 2000లో లారాదత్తా, 2021లో హర్నాజ్ కౌర్ నిలిచారు. ఈ పోటీలు ఇజ్రాయెల్ లో జరిగాయి.

Read More : Miss Universe : మిస్ యూనివర్స్‌కు అడుగు దూరంలో హర్నాజ్ కౌర్ సంధు

బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతాలా జ్యూరీ సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఆమె ఈ పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. దాదాపు 80 మంది పోటీ దారులతో పడుతోంది హర్నాజ్ కౌర్ సంధు. న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు చక్కటి సమాధానాలు చెబుతూ..వారి మనస్సులను గెలుచుకున్నారు. న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు చక్కటి సమాధానాలు చెబుతూ..వారి మనస్సులను గెలుచుకున్నారు. రోజు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను ఎలా ఎదుర్కోవాలి ? యువతులకు మీరు ఏ సలహా ఇస్తారు అంటూ న్యాయ నిర్ణేతలు పోటీదారులను ప్రశ్నించారు. దీనికి హర్నాజ్ సమాధానం ఇచ్చారు.

Read More : Hyderabad Crime : చదువు కోసం దాచుకున్న డబ్బు దోచేసిన సైబర్ నేరగాళ్లు

తమకు తాము ప్రత్యేకం అని తెలుసుకోవాలని, ఇతరులతో పోల్చుకోవడం మానేయాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందామని, బయటకు వచ్చి మాట్లాడాలన్నారు. మీ జీవితానికి మీరే నాయకుడని..అందుకే తాను ఇక్కడ నిలబడ్డానంటూ..హుందాగా సమాధానం ఇచ్చారు. శక్తివంతమైన సమాధానం ఇచ్చిన తర్వాత..సంధు..టాప్ 3 ప్లేస్ లో చోటు దక్కించుకున్నారు. వాతావరణమార్పు ఒక బూటకమని అంటుంటారు..దీనికి మీరిచ్చే సమాధానం ఏంటీ అని ప్రశ్నించారు. ప్రకృతిలో చాలా సమస్యలున్నాయని తెలిసి…తన గుండె పగిలిపోతోందన్నారు. ఇదంతా బాధ్యతారాహిత్యం వల్లే జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మనం చేసే ప్రతి చర్య ప్రకృతిని రక్షించగలదన్నారు. ఇండియాకు మిస్ యూనివర్స్ కిరీటాన్ని తీసుకొచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానంటూ పోటీలకు వెళ్లేముందు హర్నాజ్ చెప్పారు. అనంతరం మిస్ యూనివర్స్ విజేతగా ఆమె పేరు చెప్పగానే ఆనందంతో కన్నీళ్లు కార్చారు హర్నాజ్.

ట్రెండింగ్ వార్తలు