Miss Universe : మిస్ యూనివర్స్‌కు అడుగు దూరంలో హర్నాజ్ కౌర్ సంధు

న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు చక్కటి సమాధానాలు చెబుతూ వారి మనస్సులను గెలుచుకుంటున్నారు. ఇండియాకు మిస్ యూనివర్స్ కిరీటాన్ని తీసుకొచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానంటూ...చెప్పారు

Miss Universe : మిస్ యూనివర్స్‌కు అడుగు దూరంలో హర్నాజ్ కౌర్ సంధు

Miss

Miss Universe Harnaaz Sandhu : విశ్వసుందరి (మిస్ యూనివర్స్) 2021 పోటీలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 70వ మిస్ యూనివర్స్ పోటీలు ఇజ్రాయేల్ లో జరుగుతున్నాయి. భారతదేశం తరపున హర్నాజ్ సంధు పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఈమె…టాప్ 5కి చేరుకోవడంతో..టైటిల్ గెలుచుకొనే అవకాశాలు మెండుగా ఉన్నాయనే అంచనాలు నెలకొంటున్నాయి. ఈమె టైటిల్ గెలుచుకుంటే…ఇరవై ఏళ్ల తర్వాత కిరీటం దక్కనుంది. 2000 సంవత్సరంలో లారాదత్త ఇండియాకు మిస్ యూనివర్స్ కిరిటం తెచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి దాక యూనివర్స్ కిరీటం రాలేదు. దీంతో భారతీయులందరూ హర్నాజ్ కౌర్ సంధు మిస్ యూనివర్స్ నిలవాలని కోరుకుంటున్నారు.

Read More : Omicron : ఒమిక్రాన్ భయం తెలంగాణ సర్కార్ అలర్ట్, కోవిడ్ బెడ్స్ పెంపు

ఇప్పటిదాక రెండుసార్లు మాత్రమే మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. 1994లో సుస్మితా సేన్, 2000లో లారా దత్తాలు మాత్రమే మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ పోటీలకు బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతాలా జ్యూరీ సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఆమె ఈ పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. దాదాపు 80 మంది పోటీ దారులతో పడుతోంది హర్నాజ్ కౌర్ సంధు.

Read More : Australia : గ్రౌండ్‌‌లో ప్రేయసికి ప్రపోజల్ చేసిన ఆసీస్ మహిళ

న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు చక్కటి సమాధానాలు చెబుతూ..వారి మనస్సులను గెలుచుకుంటున్నారు. ఇండియాకు మిస్ యూనివర్స్ కిరీటాన్ని తీసుకొచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానంటూ…చెప్పారు. ఈమె పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారు. హిందీ, పంజాబీ, ఇంగ్లీషు భాషలను మాట్లాడే..ఈమె…పలు టైటిల్స్ లను కైవసం చేసుకున్నారు. ఓ పక్క మోడలింగ్ చేస్తూనే…సినిమాల్లో నటించే అవకాశం పొందారు. మరి కిరీటం గెలుచుకుంటారా ? లేదా ? అనేది చూడాలి.