Rajnath Singh Missile System Reliable & Safe, Rajnath Singh Tells House On Pakistan Mishap, High Level Inquiry Ordered
Rajnath Singh : పాకిస్తాన్ భూభాగంలో మన దేశీయ క్షిపణి ప్రమాదవశాత్తూ పేలిపోయిన ఘటనపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రాజ్యసభలో ప్రస్తావించారు. సాధారణ తనిఖీలు జరుగుతున్న సమయంలో అనుకోకుండా క్షిపణి పేలిందని ఆయన వివరణ ఇచ్చారు. పాక్‌లో పడిన మిస్సైల్ ప్రమాదవశాత్తూ మిస్ ఫైర్ అయిందని రాజ్‌నాథ్ చెప్పుకొచ్చారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. ఈ ఘటనకు సంబంధించి అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు మంత్రి రాజ్‌నాథ్ తెలిపారు.
ప్రభుత్వం వెపన్ సిస్టమ్‌కు సర్వోన్నత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన అన్నారు. మన మిస్సైల్ వ్యవస్థ అత్యంత సురక్షితమైనదనిగా పేర్కొన్నారు. అలాగే మిస్సైల్ వ్యవస్థ ఎంతో నమ్మదగినదని మంత్రి రాజ్ నాథ్ సభకు హామీ ఇచ్చారు. ఎలాంటి ఆదేశాలను ఇవ్వకముందే మిస్సైల్ పైకి ఎగసిందన్నారు. మార్చి 9వ తేదీన రాత్రి 7 గంటలకు రొటిన్ చెకింగ్ చేస్తున్న సమయంలో మిస్సైల్ ఒక్కసారిగా రిలీజ్ అయినట్టు గుర్తించామని మంత్రి రాజ్ నాథ్ వివరణ ఇచ్చారు. క్షిపణి పైకి ఎగిరి పక్కనే ఉన్న పాకిస్తాన్ భూభాగంలో పడిందని తెలిపారు. ఏదిఏమైనా ఈ ఘటన తీవ్రంగా ఖండించదగినదిగా తెలిపారు.
Rajnath Singh Missile System Reliable & Safe, Rajnath Singh Tells House On Pakistan Mishap, High Level Inquiry Ordered
మిస్సైల్ మిస్ ఫైర్ ఘటనను సీరియస్ గా తీసుకున్నట్టు తెలిపారు. వెంటనే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్టు చెప్పారు. విచారణ అనంతరం మాత్రమే మిస్సైల్ ఫైర్ కావడానికి అసలు కారణం ఏంటో తెలుస్తుందన్నారు. మన దేశీయ సైనిక బలగాలు ఎప్పటికప్పుడూ జాగ్రత్తగా ఉంటాయని, క్రమశిక్షణతోనే ఉన్నాయని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరలా జరగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారని రాజ్ నాథ్ రాజ్యసభకు వివరణ ఇచ్చారు. భారత క్షిపణి 124 కిలోమీటర్ల దూరంలో పాక్ భూభాగంలో పేలిందని పాక్ గురువారం ప్రకటించింది.
అయితే దీనిపై భారత రక్షణ శాఖ నుంచి స్పష్టత వచ్చింది. పాక్ వైమానికి దళానికి చెందిన ఎయిర్ డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ఆ క్షిపణిని స్వాధీనం చేసుకుంది. పాక్ గగనతలాన్ని ఉల్లంఘించి మియాచన్ను సమీపంలో పడిందని ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ బాబర్ ఇఫ్తీకర్ తెలిపారు.
Read Also : Indian Missile : పాక్ భూభాగంలో పేలిన ఇండియన్ క్షిపణీ.. టెక్నికల్ ప్రాబ్లమ్ అన్న భారత రక్షణ శాఖ