Indian Missile : పాక్ భూభాగంలో పేలిన ఇండియన్ క్షిపణీ.. టెక్నికల్ ప్రాబ్లమ్ అన్న భారత రక్షణ శాఖ

పాక్ భూభాగంలో ఇండియన్ క్షిపణి పేలిపోవడంతో ఒక్కసారిగా కలకలం రేపింది...క్షిపణిని సాధారణ నిర్వహణ చేయడం జరిగిందిని, కానీ.. ప్రమాదవశాత్తు పాక్ భూభాగంలో పేలిపోవడం పట్ల విచారం వ్యక్తం...

Indian Missile : పాక్ భూభాగంలో పేలిన ఇండియన్ క్షిపణీ.. టెక్నికల్ ప్రాబ్లమ్ అన్న భారత రక్షణ శాఖ

Missile

Updated On : March 11, 2022 / 8:31 PM IST

India Regrets Accidental Firing : పాక్ భూభాగంలో ఇండియన్ క్షిపణి పేలిపోవడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. అసలే పాక్ – భారత్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులున్న సంగతి తెలిసిందే. భారత్ – పాక్ సరిహద్దుల్లో నిత్యం కాల్పుల ఘటనలు జరుగుతుంటాయనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఓ క్షిపణి పేలిపోవడం ఉలిక్కిపడేలా చేసింది. దీనిపై భారత రక్షణ శాఖ వెంటనే స్పందించింది. సాధారణ నిర్వహణ సమయంలో, సాంకేతిక లోపం వల్ల ప్రమాదవశాత్తు పేలిందని తెలిపింది.

Read More : Jammu Kashmir : గాయపడిన సైనికుడ్ని తీసుకువచ్చేందుకు వెళ్లి..కూలిపోయిన సైనిక హెలికాప్టర్..పైలట్ మృతి

2022, మార్చి 09వ తేదీన క్షిపణిని సాధారణ నిర్వహణ చేయడం జరిగిందిని, కానీ.. ప్రమాదవశాత్తు పాక్ భూభాగంలో పేలిపోవడం పట్ల విచారం వ్యక్తం చేసింది. అయితే…ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు, ఈ సంఘటనపై కోర్టు ఆఫ్ ఎంక్వైరీ (COI)కు ఆదేశించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. Mod ప్రకటన ప్రకారం.. క్షిపణి పాక్ లోని ఓ ప్రాంతంలో పేలిపోయిందని అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. అయినా.. ఘటన జరగడం విచారం కలిగిస్తోందని పేర్కొంది.

Read More : Paytm Payments Bank : పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు.. ఎందుకంటే?

భారత క్షిపణి 124 కిలోమీటర్ల దూరంలో పాక్ భూభాగంలో దిగిందని పాక్ గురువారం ప్రకటించిన తర్వాత భారత రక్షణ శాఖ నుంచి స్పష్టత వచ్చింది. పాక్ వైమానికి దళానికి చెందిన ఎయిర్ డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ దీనిని స్వాధీనం చేసుకుంది. పాక్ గగనతలాన్ని ఉల్లంఘించి మియాచన్ను సమీపంలో పడిందని ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ బాబర్ ఇఫ్తీకర్ తెలిపారు.