Agni 5
అగ్ని-5 క్షిపణి ‘మిషన్ దివ్యాస్త్ర’ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది భారత్. ఈ విషయాన్ని తెలుపుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్ సాంకేతికతతో స్వదేశీంగా ఈ క్షిపణిని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ-డీఆర్డీవో అభివృద్ధి చేసింది.
ఒకే క్షిపణి వివిధ ప్రదేశాలలో ఒకే సారి దాడి చేసేలా దీన్ని రూపొందించారు. అంటే దీని సాయంతో అనేక వార్‌హెడ్లను వేర్వేరు లక్ష్యాల వైపుగా ప్రయోగించవచ్చు. మిషన్ దివ్యాస్త్ర పరీక్ష విజయవంతం కావడంతో భారత్ ఎంఐఆర్వీ సామర్థ్యాన్ని కలిగి ఉన్న దేశాల జాబితాలో చేరింది.
అగ్ని5 క్షిపణి ‘మిషన్ దివ్యాస్త్ర’కి సంబంధించిన వ్యవస్థను స్వదేశీ ఏవియానిక్స్ సిస్టమ్‌లు, పూర్తి కచ్చితత్వంతో వ్యవహరించే సెన్సార్ ప్యాకేజీలతో అమర్చారు. కచ్చితత్వంలో లక్ష్యాలను ఛేదించగలదు అగ్ని 5 క్షిపణి. కాగా, అగ్ని-5కి అణ్వాయుధ సామర్థ్యం ఉంది. దాదాపు 5,000 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. చైనాలో ఉన్న డాంగ్‌ఫెంగ్-41 వంటి క్షిపణులను దృష్టిలో పెట్టుకొని డీఆర్డీవో అగ్ని-5ను అభివృద్ధి చేసింది.
Also Read: హుస్సేన్‌సాగర్ అలలపై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షో.. ప్రారంభించనున్న కేంద్ర మంత్రి