MK Stalin: ఉత్తర భారత వృద్ధికి దక్షిణ భారత్‌ దోహదపడుతోంది: తమిళనాడు సీఎం స్టాలిన్

తమిళనాడు అభివృద్ధి మోడల్‌ దేశ మోడల్‌గా నిలుస్తోందని చెప్పారు.

MK Stalin

ఉత్తర భారత అభివృద్ధికి దక్షిణ భారత్‌ దోహదపడుతోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ పలు వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులోని కొంగు బెల్ట్‌లో పర్యటన సందర్భంగా అక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో స్టాలిన్ మాట్లాడారు.

అభివృద్ధి కార్యక్రమాలే లక్ష్యంగా తమ ద్రవిడియన్ మోడల్ పాలన కొనసాగుతోందని స్టాలిన్ చెప్పారు. ప్రజలు తమకు ఓటు వేసినా, వేయకపోయినా ద్రవిడ మోడల్ ప్రభుత్వం ప్రజల హృదయాలతో ముడిపడి ఉందని అన్నారు.

అందుకే ప్రజలు తమకు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. వారు తన నుంచి మరింత ఆశిస్తున్నారని చెప్పారు. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలతో పోల్చితే ఇప్పుడు డీఎంకే ప్రజాదరణ మరింత పెరిగిందని తెలిపారు.

తమిళనాడు అభివృద్ధి మోడల్‌ దేశ మోడల్‌గా నిలుస్తోందని చెప్పారు. తమిళనాడు ఇప్పుడు దేశంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, గొప్ప పట్టణీకరణ రాష్ట్రంగా ఉందని తెలిపారు. ఐక్యరాజ్యసమితి ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలో తాము ముందుంటామని చెప్పారు.

డీఎంకే వ్యవస్థాపకుడు సీఎన్‌ అన్నాదురై మాటలను స్టాలిన్‌ గుర్తు చేశారు. అప్పట్లో దక్షిణాది క్షీణిస్తున్న సమయంలో ఉత్తరాది అభివృద్ధి చెందుతోందని అన్నాదురై చెప్పేవారని తెలిపారు. ఇప్పుడు తాము దక్షిణాదిని వర్ధిల్లేలా చేశామని అన్నారు. ఈ వాస్తవాన్ని కాదనలేమని తెలిపారు. 2026 ఎన్నికల్లోనూ డీఎంకే విజయం సాధిస్తుందని అన్నారు.

ఆరోజు ఎందుకు సీరియస్ అయ్యానంటే..- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు