గో ఎహెడ్ అంటూ ఆదేశాలు : 30 నిమిషాల్లో కంప్లీట్ : స్వయంగా పర్యవేక్షించిన మోడీ

  • Publish Date - February 26, 2019 / 04:40 AM IST

యుద్ధం.. తీవ్రవాదంపై మాత్రమే చేస్తే ఎలా ఉంటుంది అని చేసి చూపించింది భారత్. సామాన్య ప్రజలకు ఎలాంటి నష్టం లేకుండా.. ఎవరికీ హానీ జరక్కుండా కేవలం తీవ్రవాదులను మాత్రమే టార్గెట్ చేసి యుద్ధం చేయటం భారత్ కే సాధ్యం అంటున్నారు నిపుణులు. పాక్ భూభాగంలో.. భారత సరిహద్దుల్లో తిష్టవేసి మరీ.. ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న శిబిరాలను గుర్తించింది ఆర్మీ. వారం రోజులుగా సమాచారం అంతా సేకరించారు. శాటిలైట్ల ఆధారంగా పాయింట్ టూ పాయింట్ గుర్తించారు. ఆ తర్వాత ఉగ్రశిబిరాలను ఎలా నాశనం చేయాలి.. దాడులు ఎలా చేయాలి.. సామాన్య ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా ఆపరేషన్ ఎలా కంప్లీట్ చేయాలని అనేది ప్రధానమంత్రి మోడీ అధ్యక్షతన హైలెవల్ మీటింగ్ ఏర్పాటు అయ్యింది. భారత్ మాత్రమే కాదు.. అటు పాకిస్తాన్ కూడా గాఢనిద్రలో ఉన్నప్పుడు ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీ కార్యాలయం బిజీగా ఉంది. బయటకు కనిపించని హడావిడి.. గాంభీర్యం ఉంది. 
Read Also : మిరాజ్ యుద్ధ విమానాల దాడి.. లైవ్ వీడియో చూడండి

గోఎహెడ్ అంటూ మోడీ ఆదేశాలు : బాలాకోట్ (హఫీజ్ సయీద్ సొంత ప్రాంతం), చకోటీ, ముజఫరాబాద్ ప్రాంతాల్లోని శిబిరాలను గుర్తించారు. వాటి లక్ష్యంగా దాడులకు ప్లాన్ చేశారు. బ్లూ ప్రింట్ ను మోదీ ఎదుట పెట్టింది భారత వాయుసేన. దాడి మెరుపు వేగంగా ఉండాలి.. ఎక్కువ మంది ఉగ్రవాదులను ఏరివేయాలి.. ఇదే ఆదేశాలతో ప్రధాని నరేంద్ర మోదీ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ‘గో ఎహెడ్’ అని ఆదేశించారంట. ఈ ఆర్డర్ నిమిషాల్లోనే.. సరిహద్దుల్లోని IAF (ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్)లో ఉన్న ఉన్నతాధికారులకు చేరాయి. అప్పటికే 3 రోజులుగా యుద్ధ సన్నాహకాల్లో ఉన్న వాయుసేన.. వెంటనే రంగంలోకి దిగింది. 

ఒకేసారి గాల్లోకి లేచిన 12 మిరాజ్ ఫైటర్లు : 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలు అన్నీ ఒకేసారి గాల్లోకి లేచాయి. 1971 తర్వాత భాతర వాయుసేనకు చెందిన యుద్ధ విమానాలు పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించాయి. ప్లాన్ ప్రకారం ఉగ్ర శిబిరాలపై బాంబులతో దాడులు చేశాయి. పదుల సంఖ్యలో ఉన్న శిబిరాలను నామరూపాల్లేకుండా చేశాయి. వెయ్యి కేజీల బాంబులను ఉగ్ర స్థావరాలపై వేశాయి. 

30 నిమిషాల్లో ఆపరేషన్ కంప్లీట్ : ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరక్కూడదు.. భారత్ వైపు ఎలాంటి నష్టం ఉండకూడదు.. ప్రత్యర్థులను నామరూపాల్లేకుండా చేయాలి అన్న ఆదేశాలతో చురుగ్గా కదిలాయి మిరాజ్ జెట్ ఫైటర్లు. అంబాలా ఎయిర్ బేస్ నుంచి గాల్లోకి లేచిన 12 యుద్ధ విమానలు.. కేవలం 30 నిమిషాల్లో ఆపరేషన్ కంప్లీట్ చేసి తిరిగి వచ్చాయి. అందరూ సేఫ్ గా ల్యాండ్ అయ్యారు. పాక్ మేల్కొనేలోపు ఆపరేషన్ కంప్లీట్ చేసింది ఆర్మీ. దెబ్బకి దెబ్బ కోసం కసితో ఎదురుచూసిన ఐఏఎఫ్ ఫైటర్లు .. వచ్చిన ఆదేశాలను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశారు. దాడికి ముందు.. త్రివిధ దళాల అధినేతలు, రక్షణ శాఖ ఉన్నతాధికారులతో మోడీ సుదీర్ఘంగా చర్చించారు.
Read Also : ఆపరేషన్ యుద్ధ్ : 12 యుద్ధ విమానాలు, 1000 కేజీల బాంబులు.. 300 మంది హతం