వచ్చే దశాబ్దం యువతదే..వీరే ముఖ్యపాత్ర పోషించబోతున్నారు..సమస్యలపై అవగాహన కలిగి ఉండడం మంచి పరిణామమని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. 2019, డిసెంబర్ 29వ తేదీ ఆదివారం మన్ కీ బాత్ లో ఆయన ప్రసంగించారు. వ్యవస్థపై యువత అంచెంచల నమ్మకం కలిగి ఉందన్నారు. వచ్చే దశాబ్దంలో కేవలం వారే అభివృద్ధే కాకుండా..దేశం పురోగమిస్తోందన్నారు. యువతలో ఉన్న శక్తి, సామర్థ్యాలు దేశం మరింత ముందుకెళ్లే అవకాశం ఉందని చెప్పారు.
Read More : పేద చిన్నారిని పట్టించుకోని కరీనా..నెటిజన్ల మండిపాటు
చంపారన్ జిల్లాలో కైరవ్ గంజ్ లో వేలాది మంది ప్రజలు ఉచితంగా వైద్య పరీక్షలు చేసుకుంటున్నారని, ఇలా చేయడం ఎంతో సంతృప్తి ఇచ్చిందన్నారు. ఫ్రీగా వైద్య పరీక్షలు చేసుకొనేందుకు చాలా మంది వచ్చారని, ఇందులో ఆశ్చర్యమేముందని అందరికీ అనిపించవచ్చన్నారు. కానీ..ప్రభుత్వ ప్రయోజిత కార్యక్రమం కాదన్నారు. కేఆర్ హై స్కూల్‌లో 1995 సంవత్సరంలో చదివిన ఓల్డ్ స్టూడెంట్స్ చొరవ తీసుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, దీనికి సంకల్ప్ 95 పేరు పెట్టడం జరిగిందన్నారు.
స్వాతంత్రం వచ్చి ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నాయని, ఇతర దేశాల ఉత్పత్తులు కాకుండా..మేడ్ ఇన్ ఇండియా, మేడ్ బై ఇండియన్స్ ఉండే విధంగా పరిస్థితులు రావాలని ఆకాంక్షించారు. 2022 వరకు లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. స్థానిక ఉత్పాదన కొనుగోలు చేసే విధంగా పనిచేయాలన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో హిమ్మాయత్ ప్రోగ్రాం గురించి మోడీ వివరించారు.
అకారణంగా చదువు ఆగిపోయిన వారందరికీ..శిక్షణ ఇవ్వడం జరుగుతోందని, 77 డిఫెరంట్ ట్రేడ్స్‌లో 18 వేల మందికి శిక్షణనిచ్చారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజలు ఎన్నుకున్న వారు పార్లమెంట్‌లో అడుగు పెట్టారని, గతంలో ఎన్నడూ జరగని విధంగా ఉభయసభలు జరిగాయన్నారు. 60 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టారని వివరించారు.
తాను సూర్య గ్రహణం చూడలేకపోయానని, ఢిల్లీలో మేఘాలు దట్టంగా అలుముకోవడం వల్ల ఇది జరిగిందన్నారు.
అయితే..కోజికోడ్ సహా ఇతర ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం సూర్యగ్రహణం స్పష్టం చూశారని పీఎం మోడీ వెల్లడించారు. జనవరిలో వచ్చే సంక్రాంతి పండుగను కొన్ని రాష్ట్రాల్లో వివిధ రకాలుగా నిర్వహించుకుంటారని, అదే సందర్భంలో గ్రేట్ తిరువల్లవర్ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటారని తెలిపారు. 2019 చివరి ఆదివారం మన్ కీ బాత్ ముగిసిపోతోందని, మరలా 2020 కలుద్దామని, అందరం దేశాభివృద్ధికి కృషి చేద్దామని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.
#MannKiBaat begins shortly. Do tune in. pic.twitter.com/jlCwKJZJrP
— PMO India (@PMOIndia) December 29, 2019