Haryana : ట్రంప్ కు వాడిన డ్రగ్ ను వృద్ధుడికి ఇచ్చిన వైద్యులు

హర్యానా రాష్ట్రానికి చెందిన 84 సంవత్సరాలున్న మొహబ్బత్ సింగ్ ఇచ్చారు. యాంటీబాడీస్ కాక్ టైల్ తీసుకున్న ఐదు రోజులకు ఇతను కోలుకున్నాడు. గురుగ్రామ్ లోని మెదాంత ఆసుపత్రిలో మొహబ్బత్ సింగ్ కరోనా వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. ఐదు రోజులుగా యాంటీబాడీ కాక్ టెయిల్ డ్రగ్ ను అందించారు. దీంతో అతను త్వరగానే కోలుకున్నారు.

Mohabbat Singh

Mohabbat Singh : గత సంవత్సరం అమెరికా ఎన్నికల సమయంలో కరోనా వైరస్ బారిన పడిన నాటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వారం రోజుల్లోనే కోలుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే. అసలు ఆయనకు ఏ మందు ఇచ్చారు ? ఇంత త్వరగా కోలుకున్నారనే దానిపై హాట్ హాట్ చర్చలు జరిగాయి. దీనికి కారణం…ఓ యాంటీబాడీ కాక్ టెయిల్ మందే కారణమని తేలింది.

ఈ మందును భారత్ అందుబాటులోకి తెచ్చింది. అమెరికా, యూరప్‌లలో ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్‌టైల్ వాడకం ఎక్కువగా ఉంది. తాజాగా..ఈ మందును హర్యానా రాష్ట్రానికి చెందిన 84 సంవత్సరాలున్న మొహబ్బత్ సింగ్ ఇచ్చారు. యాంటీబాడీస్ కాక్ టైల్ తీసుకున్న ఐదు రోజులకు ఇతను కోలుకున్నాడు. గురుగ్రామ్ లోని మెదాంత ఆసుపత్రిలో మొహబ్బత్ సింగ్ కరోనా వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. ఐదు రోజులుగా యాంటీబాడీ కాక్ టెయిల్ డ్రగ్ ను అందించారు. దీంతో అతను త్వరగానే కోలుకున్నారు.

2021, మే 26వ తేదీ బుధవారం ఆసుపత్రి నుంచి సురక్షితంగా డిశ్చార్జ్ అయినట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. యాంటీబాడీస్ కాక్ టైల్ ట్రీట్ మెంట్ అనంతరం అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ? అనే దానిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు.

Read More : Deepika Padukone : క్లాసిక్ డైరెక్టర్, ట్రెండింగ్ హీరోయిన్ కాంబోలో నాలుగో సినిమా..