Deepika Padukone : క్లాసిక్ డైరెక్టర్, ట్రెండింగ్ హీరోయిన్ కాంబోలో నాలుగో సినిమా..

తన క్లాసిక్ హీరోయిన్ దీపికా పదుకొణేతో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ..

Deepika Padukone : క్లాసిక్ డైరెక్టర్, ట్రెండింగ్ హీరోయిన్ కాంబోలో నాలుగో సినిమా..

Deepika Padukone To Reunite With Sanjay Leela Bhansali For New Movie

Deepika Padukone: తన క్లాసిక్ హీరోయిన్ దీపికా పదుకొణేతో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ. ‘గంగూబాయి కతియావాడి’ సినిమా విషయంలో సంజయ్, దీపికల మధ్య మాటల యుద్ధం జరిగిందని.. ఫ్యూచర్‌లో కలిసి పని చేసే ప్రసక్తే లేదన్న టాక్ నిన్నటివరకు నడించింది. అది నిజమో.. గాసిప్పో తెలీదు కానీ.. అసలిప్పుడెందుకు ఈ క్రియేటివ్ కాంబో కలుస్తోంది.. ఓసారి చూద్దాం..

క్లాసిక్ డైరెక్టర్, ట్రెండింగ్ హీరోయిన్ మరోసారి కలవనున్నారు. సంజయ్ లీలా భన్సాలీ, దీపికా పదుకొణే కాంబినేషన్‌లో నాలుగో క్లాసిక్ రానుంది. ప్రస్తుతం సంజయ్ తెరకెక్కిస్తోన్న ‘గంగూబాయి కతియావాడి’ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. జూలై 30న రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. గంగూభాయ్ తర్వాత ఆయన ‘బైజు బావ్రా’ అనే సినిమా కోసం కసరత్తులు చేస్తున్నారని టాక్. అందుకోసం దీపికాతో రీయూనియన్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇందులో ‘డెకాయిట్ రూపమతి’ అనే రోల్‌లో దీపికా కనిపించనుందనే న్యూస్ ప్రెజెంట్ వైరల్‌గా మారింది.

‘బైజు బావ్రా’ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే సంజయ్ – దీపికల మధ్య పలు సిట్టింగ్స్ జరిగాయని బాలీవుడ్ సమాచారం. 2022లో సెట్స్ పైకెళ్లబోయే ఈ మూవీకి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ సంజయ్ రెడీ చేస్తున్నారని అంటున్నారు. నిజానికి దీపిక రూపమతి పాత్రను 1952లో రిలీజైన క్లాసిక్ ‘బైజు బావ్రా’ సినిమా నుంచి తీసుకున్నారు. అయితే ఒరిజనల్ మూవీలో బైజూ క్యారెక్టర్‌ను హైలైట్ చేయగా.. సంజయ్ మాత్రం రాణి రూపమతి రోల్‌ను హైలైట్ చేయనున్నారు. ఇదే సినిమాలోని గౌరీ, తాన్ సేన్, అక్బర్ వంటి ఒరిజనల్ క్యారెక్టర్స్ కోసం ఇతర యాక్టర్స్‌ను సంప్రదిస్తున్నారు.

సంజయ్, దీపికా కాంబినేషన్లో ఇప్పటికే ‘రామ్ లీలా’, ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ లాంటి బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అందుకే ‘బైజు బావ్రా’ సినిమాపై కూడా భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు ఆడియెన్స్. ఈమధ్యే దీపికా పదుకొణే తన భర్త రణ్‌వీర్ సింగ్‌‌తో కలిసి ‘83’లో నటించింది. ఇక సిద్ధార్థ్ ఆనంద్ -షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ మూవీలో నటిస్తోంది. శకున్ బత్రా డైరెక్షన్లో ఓ మూవీ, అమితాబ్ తో ‘ది ఇంటర్న్’ రీమేక్‌లకి కమిటైన దీపిక.. మధు మంతెన డైరెక్షన్లో ‘ద్రౌపది’, హృతిక్ రోషన్ ‘ఫైటర్’ సినిమాలపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అలాగే తెలుగులో నాగ్ అశ్విన్ – ప్రభాస్ సినిమా కోసం డేట్స్ అడ్జెస్ట్ చేస్తోన్న విషయం తెలిసిందే..