Omicron Variant : దేశంలో ఆందోళనకర స్థాయిలో ఒమిక్రాన్ వ్యాప్తి

భారత్‌లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆదివారం ఉదయం నాటికి ఒమిక్రాన్ కేసులు 1525 చేరాయి.

Omicron Variant : భారత్‌లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆదివారం ఉదయం నాటికి ఒమిక్రాన్ కేసులు 1525 చేరాయి. ఇక ఈ వేరియంట్ నుంచి కోలుకొని 560 మంది ఇళ్లకు చేరారు. ఇప్పటి వరకు 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. ఢిల్లీ రెండవ స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్, తమిళనాడు, కేరళ, రాజస్థాన్ ,తెలంగాణ, కర్ణాటక, హర్యానా ఉన్నాయి.

చదవండి : Omicron Scare : మేక్ షిఫ్ట్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయండి..రాష్ట్రాలకు కేంద్రం మరో లేఖ

ఇక ఆయా రాష్ట్రాల్లో నమోదైన ఒమిక్రాన్ వేరియంట్ కేసుల వివరాలను ఒకసారి పరిశీలిస్తే.. మహారాష్ట్రలో 460, ఢిల్లీలో 351, గుజరాత్ 136, తమిళనాడులో 117, కేరళలో109, రాజస్థాన్ 69, తెలంగాణ 67,కర్ణాటక 63,హర్యానా 63, పశ్చిమ బెంగాల్ 29, ఏపీ17, ఒడిశా 14, మధ్యప్రదేశ్ 9, ఉత్తరప్రదేశ్ 8, ఉత్తరాఖండ్ 8,చండిఘడ్ 3 జమ్మూకాశ్మీర్ 3, అండమాన్ నికోబార్ 2, గోవా 1, హిమాచల్ ప్రదేశ్ 1, లద్దాఖ్ 1,మణిపూర్ 1,పంజాబ్ 1 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు.

చదవండి : Telangana Omicron Cases : తెలంగాణలో ఒమిక్రాన్ కలవరం.. ఒక్కరోజే 12 కేసులు నమోదు

 

 

ట్రెండింగ్ వార్తలు