Omicron Scare : మేక్ షిఫ్ట్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయండి..రాష్ట్రాలకు కేంద్రం మరో లేఖ

దేశంలో కోవిడ్ కేసులతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు శనివారం మరో లేఖ రాసిన

Omicron Scare : మేక్ షిఫ్ట్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయండి..రాష్ట్రాలకు కేంద్రం మరో లేఖ

Delhi

Omicron Scare : దేశంలో కోవిడ్ కేసులతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు శనివారం మరో లేఖ రాసిన కేంద్రం… వైరస్​ కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించింది. మేక్ షిఫ్ట్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని, హోం ఐసొలేషన్ లో ఉన్న పేషెంట్లను మానిటర్ చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

కరోనా స్వల్ప లక్షణాలు ఉన్న వారి ఐసోలేషన్ కోసం హోటల్‌ గదులను సిద్ధం చేయాలని ఆ లేఖలో రాష్ట్రాలకు సూచించారు. జిల్లాలు, వార్డుల వారీగా ఏర్పాటు చేయాలని తెలిపారు. కరోనా పరీక్షలు, అంబులెన్సులు, ఆసుపత్రుల్లో పడకల ఏర్పాటుకు యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచాలని సూచించారు. అవసరమైన వారు ఫోన్ చేయగానే అంబులెన్సులు, ఆసుపత్రి పడకలు సిద్ధం చేసేలా ఈ యంత్రాంగం ఉండాలని స్పష్టం చేశారు. దీని అందుబాటు గురించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. అన్ని జిల్లాలు, సబ్-డిస్ట్రిక్ట్ స్థాయిలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలు సహా పిల్లలపై రాష్ట్రాలు ప్రత్యేక దృష్టి సారించాలని, అవసరమైన రవాణా, ఆక్సిజన్ అందుబాటు గురించి నిరంతరం సమీక్ష నిర్వహించాలని తెలిపారు.

కాగా, శుక్రవారం కూడా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖ రాసిన విషయం తెలిసిందే. వివిధ ప్రాంతాల్లో 24 గంటలూ నిరంతరాయంగా పనిచేసే రాపిడ్ యాంటిజన్ టెస్ట్ బూత్ లు ఏర్పాటు చేయాలని, మెడికల్, పారామెడికల్ సిబ్బందిని రంగంలోకి దింపాలని, అలాగే హోం టెస్ట్ కిట్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆ లేఖలో రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. జ్వరాలు, ఒళ్లు నొప్పులతో వస్తున్న రోగులందరికీ కోవిడ్ టెస్ట్ లు చేయాలని కోరింది.

ALSO READ Kashmir Encounter : కశ్మీర్ లో ఎన్ కౌంటర్..ఉగ్రవాది హతం