Mother Dangles Child: సిల్లీ రీజన్‌తో పిల్లాడికి బెడ్‌షీట్‌ కట్టి తొమ్మిదో ఫ్లోర్ నుంచి కిందకు..

కింద పడిపోయిన వస్తువు తీసుకురావడానికి తొమ్మిదో ఫ్లోర్ నుంచి ఎనిమిదో అంతస్తుకు బెడ్ షీట్ సాయంతో దించింది ఆ తల్లి. ఇదంతా ఎదురుగా ఇంట్లో ఉండే వ్యక్తి వీడియో తీయడంతో వైరల్ అయింది.

Mother Dangles Child: సిల్లీ రీజన్‌తో పిల్లాడికి బెడ్‌షీట్‌ కట్టి తొమ్మిదో ఫ్లోర్ నుంచి కిందకు..

Mother And Child

Updated On : February 10, 2022 / 4:22 PM IST

Mother Dangles Child: కింద పడిపోయిన వస్తువు తీసుకురావడానికి తొమ్మిదో ఫ్లోర్ నుంచి ఎనిమిదో అంతస్తుకు బెడ్ షీట్ సాయంతో దించింది ఆ తల్లి. ఫరీదాబాద్ లో జరిగిన ఈ ఘటన ఎదురింట్లో ఉండే వ్యక్తి వీడియో తీయడంతో వైరల్ అయింది. పడిపోయిన వస్తువు తీసుకురావడానికి ప్రాణాలకు తెగించి ఇలా చేయడం ఎంతవరకూ కరెక్ట్ అని అడిగిన ప్రశ్నకు ఆమె ఇలా బదులిచ్చింది.

తొమ్మిదో అంతస్థులో ఉన్న బాల్కనీ నుంచి బెడ్ షీట్ సాయంతో కింది ఫ్లోర్ బాల్కనీకి చిన్నారిని దించింది. మామూలుగా కిందకు పంపకుండా అంత అజాగ్రత్తను చూపించడం, అది కూబా బెడ్ షీట్ కట్టి కిందకు దించడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

ఆ వీడియోలో చిన్నారికి ఎల్లో షీట్ కట్టి కిందకు వదులుతుండగా.. చిన్నారి మొఖంలో ఏ మాత్రం భయం లేకుండా కిందకు దిగి పైకి ఎక్కింది.

Read Also : సామాన్య భక్తులకు టీటీడీ శుభవార్త

ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత చిన్నారిని అడిగిన ప్రశ్నకు.. ‘ఏదో ఒక రోజు అందరం చచ్చిపోతాం’ అని రెస్పాన్స్ ఇచ్చింది.

ఆమె తల్లిని అడగ్గా.. ‘నన్ను క్షమించండి. ఎవరో వీడియో తీస్తున్నారనే విషయాన్ని గమనించలేదు’ అని సర్ది చెప్పుకుంది. తాను చేసిన పని తప్పు అనే పశ్చాత్తాపం లేకుండా వీడియో తీస్తున్నట్లు తాను గమనించలేదని చెప్తుండటంపై తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ఇదంతా ఎదురుగా ఉండే ప్రాంతం వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అయింది.