Mount Kailash View Point In Indian land
Mount Kailash View Point In Indian land : కైలాస పర్వతం. సాక్షాత్తు ఆ పరమశివుడికి ప్రతిరూపంగా హింధువులు భావించే పరమ పవిత్రమైన పర్వతం. ఆ కైలాసనాధుడే తన భార్య పార్వతి, అతని ప్రియమైన వాహనం నందితో కలిసి శాశ్వతమైన ధ్యానంలో ఈ పర్వతంపై నివసిస్తున్నాడని నమ్ముతారు. ఈ కైలాస పర్వతంపై విమానాలు కూడా తిరగవని అలా యత్నించిన విమానాలు కనిపించకుండాపోయాయని అంటుంటారు. ఇలా కైలాస్ పర్వతం గురించి ఎన్నో మిస్టరీలను ఛేదించనటాకి ఎన్ని పరిశోధనలు జరిగాయి. కానీ మిస్టరీలను మాత్రం ఛేదించలేకపోయారు. ఎన్ని వింతలు, విశిష్టతలు కలిగిన ఈ కైలాస పర్వతాన్ని దర్శించుకోవాలంటే టిబెట్ వెళ్లాల్సిందే.
కానీ ఇకపై అక్కడ వరకు వెళ్లకుండానే ఆ పరమ పవిత్రమైన పర్వతాన్ని దర్శించుకునే ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారత ప్రభుత్వం తమ భూభాగం నుంచి కైలాస్ పర్వతాన్ని దర్శించుకునే ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే సెప్టెంబర్ (2023)నాటికే ఈ రోడ్డు మార్గం ఏర్పాటు అయి కైలాస్ పర్వతాన్ని వీక్షించుకునే అవకాశం కలుగనుంది.
ఈ మార్గం పూర్తి అయితే ఇక టిబెట్ వెళ్లకుండానే వ్యయ ప్రయాసలు లేకుండానే కైలాస్, మానస సరోవరాన్ని భారత్ నుంచే దర్శించుకోవచ్చు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (Border Roads Organization(BRO) ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణం వేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ కల్లా సిద్ధమవుతుందని భావిస్తున్నారు. దీని కోసం భారత్ – చైనా సరిహద్దుల్లో ఉన్న కేఎంవీఎన్ హట్స్ నుంచి లిపులేక్ పాస్ వరకు ఆరున్నర కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మిస్తున్నారు.
ఈ మార్గం నుంచి కైలాస పర్వతాన్ని దర్శించుకోవచ్చు. కైలాస్ వ్యూపాయింట్ (Mount Kailash View Point)ను భారత ప్రభుత్వం (Indian Govt)అభివృద్ధి చేస్తోంది. లిపులేక్ పాస్ ద్వారా చేపట్టాల్సిన కైలాస్ మానస సరోవర యాత్ర కరోనా కారణంగా వాయిదా పడింది. దీంతో, మన భూభాగం నుంచి కైలాసగిరిని వీక్షించేందుకు వ్యూపాయింట్ ను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.
ఈ ఏర్పాట్ల గురించి BRO ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ విమల్ గోస్వామి (Vimal Goswami, Chief Engineer of BRO) మాట్లాడుతు.. KMVN హట్స్ (KMVN Huts) నుంచి నాభిధాంగ్ (Nabhidhang)లోని లిపులేఖ్ పాస్ (Pithoragarh district to Lipulekh) వరకు ఆరున్నర కిలోమీటర్ల పొడువున రహదారి నిర్మాణ పనులు ప్రారంభించామని తెలిపారు. ఇది పూర్తి అయితే ‘కైలాష్ వ్యూ పాయింట్’ రెడీ అవుతుందని తెలిపారు. కాగా ఈ కైలాష్ వ్యూ పాయింట్ ను అభివద్ధి చేసే బాధ్యతను భారత్ ప్రభుత్వం హిరాక్ ప్రాజెక్టుకు అప్పగించింది. రోడ్డు నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వాతావరణం అనుకూలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్ నాటికే కైలాశ్ పర్వతాన్ని భారత భూభాగం నుంచి దర్శించుకోవచ్చు గోస్వామి తెలిపారు.
పవిత్రమై మానస సరోవర్, రాక్షస తాల్ సరస్సుల ప్రాంతం..
కైలాస పర్వతం దగ్గర మానస సరోవర్, రాక్షస తాల్ అనే రెండు అందమైన సరస్సులు ఉన్నాయి. మానస సరోవరం 14,950 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన మంచినీటి సరస్సుగా పేరొందింది. ఈ పర్వత యాత్రకు వెళ్లినవారు ఎన్నో వింత వింత అనుభూతులకు గురవుతుంటారట. ఎంతో కష్టపడి ఆ పర్వతం సమీపంలోకి వెళ్లి వచ్చిన తరువాత వారిచేతి గోళ్లు, జుట్టు కొన్ని మిల్లీమీటర్లు పెరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మంచుతో నిండిన ఈ పర్వతంపై సూర్యకిరణాలు పడి బంగారంలో మెరిసిపోయే ఆ పర్వతాన్ని చూడటానికి రెండు చాలవు. అందంతో పాటు ఆధ్యాత్మికతను కలిగించే ఈ పర్వతం గురించి ఎన్నో రహస్యాలు నేటీకి అలాగే ఉన్నాయి.
సాహసాలు చేసే పర్వతారోహకులు కూడా కాలు మోపలేని పర్వతం..
ప్రపంచంలో అత్యంత సాహసీకులు సైతం అధిరోహించలేని పర్వతం ఏదన్నా ఉందీ అంటే అది ఈ ‘కైలాస పర్వతమే’అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కైలాస పర్వతం దగ్గర మానస సరోవర్, రాక్షస తాల్ అనే రెండు అందమైన సరస్సులు ఉన్నాయి. మానస సరోవరం 14,950 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన మంచినీటి సరస్సుగా పేరొందింది. ఈ పర్వత యాత్ర నుంచి తిరిగి వచ్చినవారి చేతి గోళ్లు, జుట్టు కొన్ని మిల్లీమీటర్లు పెరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీనిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు విస్మయం కలిగించే ఎన్నో విషయాలను వెల్లడించారు.
అతిపెద్ద నదుల జన్మస్థలం..
ఈ పర్వతాన్ని అధిరోహించాలనుకునేవారి వయస్సు పెరుగుతుందని అందుకే అలా వెళ్లినవారు తిరిగిరారు అని అంటుంటారు. ఇలా ఈ పర్వతంపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఇప్పటికీ జరుగుతున్నాయి. కానీ రహస్యాలను మాత్రం ఎవ్వరు ఛేధించలేకపోతున్నారు. ఎందుకంటే మానవతీత శక్తుల భగవంతుడి శక్తి అని లయకారకుడైన పరమశివుడి ఆవాసం అని హిందువుల నమ్మకం. ఆసియాలోని అతి పెద్ద నదులైన సింధు, సట్లేజ్,బ్రహ్మపుత్ర,కర్నాలి నదులు ఈ పర్వత శ్రేణుల్లోనే పుట్టాయి. బౌద్ధ, హిందూ, జైన మతాలు కైలాస పర్వతాన్ని పవిత్రస్థలంగా భావిస్తాయి.